ట్రంప్ కు కంటిమీద కునుకుపట్టని పని ఇరాన్ చేసేసిందా?

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు 12వ రోజు చల్లబడిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-25 07:55 GMT

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు 12వ రోజు చల్లబడిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ - ఇరాన్  మధ్య మొదలైన యుద్ధం మంగళవారం ముగిసింది! ఆపరేషన్  రైజింగ్  లయన్  అంటూ ఇజ్రాయెల్  యుద్ధం మొదలుపెట్టినా, ఆపరేషన్  మిడ్  నైట్  హ్యామర్  అంటూ అమెరికా రంగంలోకి దిగినా.. అందుకు ప్రధాన కారణం ఇరాన్  అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే!

ఇరాన్  అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్‌  ప్రకటించింది. అణు ఒప్పందాలపై చర్చలు సెట్  కావడం లేదంటూ అమెరికా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరాన్  అణు పరీక్షలు నిర్వహించేసిందనే విషయం తెరపైకి వచ్చింది!

అవును... ఇరాన్  ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు అనే లక్ష్యంతో ఇజ్రాయెల్  యుద్ధం ప్రకటించగా, చివర్లో అమెరికా ఓ చెయ్యి వేసి పని పూర్తి చేసిందని చెబుతున్నారు. అయితే... ఇలా ఇజ్రాయెల్  ఒక పక్క, అమెరికా ఓ పక్క దాడులు చేసిన గ్యాప్  లో తాను అనుకున్న పనిని ఇరాన్  పూర్తి చేసిందనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది.

ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీకి రెండు రోజుల ముందు, గత శుక్రవారం ఉత్తర ఇరాన్  లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చిందనే వార్తలు వెలువడ్డాయి. అయితే.. ఇది నిజంగానే భూకంపమా.. లేక, ఇరాన్  అణుపరీక్షలు నిర్వహించడం వల్ల భూమి లోపల ఏర్పడిన భారీ ప్రకంపనల ప్రభావమా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా నడిచింది.

అయితే ఆ ప్రచారం ఇప్పుడు అటు అమెరికా, ఇజ్రాయెల్  తో పాటు వీరి మిత్ర దేశాల్ని సైతం కలవరపెడుతున్నాయని అంటున్నారు. తమ దాడులతో ఇరాన్  అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నామని, అణు స్ధావరాల్ని దెబ్బతీశామని, అందువల్ల ఇప్పట్లో ఇరాన్  అణుబాంబు గురించి ఆలోచించడమే కష్టమని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్  చెప్పుకుంటున్నాయి.

సరిగ్గా ఈ సమయంలో... ఇరాన్  లోని సెమ్నెన్  నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో అణు పరీక్ష జరిగిందంటూ తస్నీమ్  న్యూస్  ఏజెన్సీ ఓ షాకింగ్  కథనాన్ని వెల్లడించింది. దీంతో... ఈ అణు పరీక్ష తర్వాతే ఉలిక్కిపడ్డ అమెరికా ఇరాన్  లోని అణు కేంద్రాలపై దాడులకు దిగిందన్న చర్చ మొదలైంది. దీంతో.. ఇప్పుడు ట్రంప్ & కో ఇరకాటంలో పడ్డారని అంటున్నారు.

దీనికితోడు... ఈ దాడుల్లో ఇరాన్‌  కు జరిగిన నష్టం గురించి పెంటగాన్‌  కు చెందిన డిఫెన్స్  ఇంటెలిజెన్స్  ఏజెన్సీ (డీఐఏ) ఓ నివేదిక తయారుచేసింది. ఇందులో.. ఆపరేషన్  మిడ్  నైట్  హ్యామర్  అంటూ అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌  కు పరిమితమైన నష్టం మాత్రం వాటిల్లిందని తెలిపింది. ఇరాన్  కొన్ని నెలల్లోనే తన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేసుకోవచ్చని తెలిపింది!

ఇలా ఓ పక్క తస్నీమ్  న్యూస్  ఏజెన్సీ కథీనం, మరోపక్క పెంటగాన్  కు చెందిన డిఫెన్స్  ఇంటెలిజెన్స్  ఏజెన్సీ నివేదిక.. ట్రంప్  ను బిగ్  షాక్  కి గురిచేస్తున్నాయని అంటున్నారు! పైగా ఇప్పటికే సీజ్  ఫైర్  ప్రకటించేశారు! దీంతో... ట్రంప్  & కో నెక్స్ట్  ప్లాన్  ఏమిటనేది ఆసక్తిగా మారింది! 

Tags:    

Similar News