• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ అజ్ఞాతంలో... ఎందుకలా...

పవన్ అజ్ఞాతంలో... ఎందుకలా ?

| ఆ తరువాత నుంచి ఆయన వాయిస్ అలాగే ఆయన గురించిన వార్తలు పెద్దగా రావడం లేదు.

By - Tupaki Desk
Update: 2025-02-01 04:13 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సందడి చేయడం లేదు అన్న చర్చ వస్తోంది. ఆయన రిపబ్లిక్ డే రోజున కనిపించారు. ఆ తరువాత నుంచి ఆయన వాయిస్ అలాగే ఆయన గురించిన వార్తలు పెద్దగా రావడం లేదు. ఎందువల్ల అన్నది ఇపుడు చర్చ సాగుతోంది.

పవన్ అజ్ఞాతంలో ఉన్నారా ఉంటే ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అన్నది కూడా మరో చర్చగా ఉంది. పవన్ కళ్యాణ్ ఒక వైపు పాలనా వ్యవహారాలను చూసుకుంటూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నారు. దాంతో ఆయన సైలెంట్ గా తన సినిమాల వర్క్ కానిచ్చేస్తున్నారా అన్నది కూడా డిస్కషన్ సాగుతోంది.

అయితే అది కూడా కాదనే మళ్ళీ అంటున్నారు. మరి పవన్ ఎక్కడ ఉన్నారు అంటే ఆయన చాలా కాం గా విదేశీ పర్యటన పెట్టుకున్నారు అక్కడికే ప్రస్తుతం వెళ్ళారు అని వార్తలు వినవస్తున్నాయి. ఆయన తన భార్యతో పాటు పిల్లలను కలుసుకునేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళారు అని ప్రచారం అయితే సాగుతోంది. అక్కడ కొద్ది రోజులు ఉన్న అనంతరం పవన్ నేరుగా ఢిల్లీకి చేరుకుంటారని అంటున్నారు. ఆయన బహుశా ఫిబ్రవరి 2 నాటికి ఢిల్లీలో బీజేపీ తరఫున శాసనసభ ఎన్నికల ఫ్రచారంలో పాలు పంచుకుంటారు అని అంటున్నారు.

పవన్ ని ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకోమని ఆహ్వానించింది. ఆయన గతంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్నారు. అక్కడ బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు దక్కాయి. దాంతో పవన్ మార్క్ పాలిటిక్స్ తో హిట్ కొట్టామని బీజేపీ పెద్దలు భావించారు. ఆ సెంటిమెంట్ ని పట్టుకుని ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఆయన చేత ప్రచారం చేయించుకోవాలని చూస్తున్నారు.

అయితే పవన్ ఎపుడు ప్రచారం చేస్తారు అన్నది ఇంకా ఖరారు అయితే కాలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల క్యాంపెయిన్ షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయలేదు. మరో వైపు చూస్తే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి మూడో తేదీతో ముగుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఫిబ్రవరి 1 2 తేదీలలో ప్రచారం చేస్తారు అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ మాత్రం కొద్ది రోజులుగా ఇలా అజ్ఞాతంలో ఉండడం వెనక విదేశీయానమే కారణం అని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత ఉన్నది అయితే తెలియదు కానీ పవన్ సమీక్షలు అవీ లేకపోవడంతో ఆయన తెర వెనకనే ఉన్నారన్నది వాస్తవం అంటున్నారు.

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Chandrababu 
  • Apcm 
  • Pawankalyan 
  • Deputycm 
  • Delhielections 
  • Politicalstartegy 

Similar News

చిన్న‌మ్మ‌ స‌మ‌ర్థ‌న.. అంతా బాగున్న‌ట్టేనా.. !

2026-11-12 12:30 GMT

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS