అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ దేశంలో అయ్యప్ప స్వామి భక్తులు కోట్లలో ఉన్నారు. ప్రతీ ఏటా శీతాకాలం వచ్చిందంటే మాలధారణ చేస్తారు. మండల దీక్షలు చేపట్టి ఆ మీదట ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శబరిమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు.;
ఈ దేశంలో అయ్యప్ప స్వామి భక్తులు కోట్లలో ఉన్నారు. ప్రతీ ఏటా శీతాకాలం వచ్చిందంటే మాలధారణ చేస్తారు. మండల దీక్షలు చేపట్టి ఆ మీదట ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి శబరిమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక శబరిమల వెళ్ళడానికి రైళ్ళే ఇప్పటిదాకా ప్రధాన ప్రయాణ సాధనంగా వారికి ఉండేది. ఇక కొంతమంది ప్రత్యేకంగా వాహనాలు సిద్ధం చేసుకుని వెళ్ళడమూ జరుగుతోంది. కానీ విమానయానంలో మాత్రం వారు శబరిమల దాకా వెళ్ళే సదుపాయంఅవకాశం ఉన్నా అక్కడి ఆంక్షలతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం వారికి ఇపుడు ఆ అవకాశం ఇస్తోంది. ఒక విధంగా వారికి తీపి కబురే అందించింది.
ఇరుముడితో పాటుగా :
అయ్యన్న భక్తులు ఇరుముడితో శబరిమల వెళ్తారు. పవిత్రంగా దానిని పట్టుకుని వెళ్తారు. ఇపుడు విమాన ప్రయాణంతో ఇరుముడితో పాటుగా వెళ్ళవచ్చు అని కేంద్ర పౌర విమానయాన శాఖ అనుమతించింది. దానిని చేతి సామాను మాదిరిగా తమ వెంట తీసుకుని వెళ్ళేందుకు ప్రత్యేకంగా సదుపాయం కల్పిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
భక్తుల మనోభావాలు :
అయ్యప్ప భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు విమాన ప్రయాణంలో కట్టుదిట్టమైన భద్రతా పరమైన ఏర్పాట్లు ఉంటాయి. వాటి ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అలా వాటిని పాటిస్తూనే అయ్యప్ప భక్తులకు ప్రయాణించే వెసులుబాటుని కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. అయ్యన్న భక్తులు పాటించాల్సిన సంప్రదాయాలు ఆచారాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా విమాన యాన శాఖ తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.
ఆధ్యాత్మిక విలువల కోసం :
భారత దేశం అంటేనే ప్రపంచం గరించే ఆధ్యాత్మిక సంప్రదాయ విలువలకు పెట్టింది పేరు అని కేంద్ర మంత్రి అన్నారు. అలా వాటిని గౌరవిస్తూ భక్తుల ఆచారాలను వారి మనోభావాలను కాపాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పారు. ప్రతీ భక్తుడికి ఇది ఒక గౌరవం, వారికి కేంద్రం అందించే భరోసాగా ఆయన చెప్పారు.
ఇరుముడికి ఆంక్షలు :
ఇదిలా ఉంటే ఇప్పటిదాకా అయ్యప్పభక్తులు ఇరుముడితో విమానంలో ప్రయాణం చేయాలీ అంటే ఇరుముడిని తప్పనిసరిగా చెక్ ఇన్ లగేజీగా పంపించాల్సి ఉంది. ఇది విమానయాన శాఖ రూల్స్ గా ఉన్నాయి. దాంతో భక్తులు తాము పవిత్రంగా భావించే ఇరుముడి విషయంలో ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. కానీ అయ్యప్ప భక్తుల విన్నపాల మేరకు కేంద్రం వారి పట్ల సానుకూలంగా వ్యవహిస్తోంది. వారి కోసం ప్రత్యేక సడలింపు ఇచ్చింది. ఇది నవంబర్ 29 నుంచి జనవరి 20 దాకా అమలులో ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో శబరిమల విమానాలలో వెళ్ళే భక్తులు ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు పూర్తి చేసిన తరువాత తమ ఇరుముడిని తమతోనే ఒక చేతి సామానుగా విమానం క్యాబిన్ లోకి తీసుకుని వెళ్ళవచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అయ్యన్న భక్తులు అంతా పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.