ఢిల్లీ ప్రభుత్వంలో ఐ ఫోన్ చిచ్చు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..
మనది ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకునే నాయకులు ప్రజలను పాలించేది.;
మనది ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకునే నాయకులు ప్రజలను పాలించేది. ఒకప్పుడు నాయకులు అంగబలం, అర్థ బలం ఉన్న వారు కాదు. కేవలం సేవ చేసే వారిని మాత్రమే ప్రజలు తమ ప్రతినిధిగా ఎంచుకునేవారు. కానీ కాలం మారింది రాజకీయం చేయాలంటే అంగబలం అర్థబలం తప్పకుండా తీరాల్సిందే. ఇవేవీ లేకుంటే వారు నాయకులు కాలేరు. కనీసం నలుగురు చుట్టూ తిరగనిదే నాయకుడు కాలేడు. తిరగాలంటే వారిని పోషించక తప్పదు.
నాయకుల వద్ద డబ్బు లేదా..?
ఆంధ్రప్రదేశ్ కు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనను తోటి నాయకుడు అడిగారట. పంతులు గారు మీరెప్పుడు శాలువా కప్పుకొని ఎందుకు ఉంటారని. అందుకు ఆయన చెప్పిన సమధానం లోపల దుస్తులు కొంచెం చిరిగాయండి.. శాలువాతో కవర్ చేస్తున్నా.. ముఖ్యమంత్రి బట్టలు చిరిగాయని తెలిస్తే బాగోవు కదా అన్నారట. అది విన్న నాయకుడు కంట తడిపెట్టారట. అలాంటి నాయకుల కాలం నుంచి రాజకీయం చేయాలంటే కోట్లు ఉండాలి.. రాజకీయంలో ఉండగా కోట్లు సంపాదించాన్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు నాయకులను కాపాడుకోవడమే పార్టీకి తలనొప్పిగా మారింది. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక తాయిలాలు కామన్ గానే కనిపిస్తుంది. ఈ రోజుల్లో నాయకులంటే కోట్ల రూపాయలు ఉన్న ధనవంతులు. ఇందులో కొందరు మాత్రమే ప్రజలకు నిజమైన సేవ చేస్తూ డబ్బుకు దూరంగా ఉంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంపై ఫైర్..
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. శాసన సభ్యులందరికీ (ప్రతిపక్ష నాయకులను కలుపుకొని) ఐఫోన్లు, ట్యాబ్ లు ఇవ్వాలనుకుంది. పేపర్ లెస్ అసెంబ్లీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా ఒక్కో నాయకుడికి ఐఫోన్ ప్రో16, లెటెస్ట్ మోడల్ ఐ ట్యాబ్. దీనిపై భిన్నమైన కామెంట్లు వినిపిస్తు్న్నాయి.
ప్రజాధనం వృథా అవుతుందంటున్న నెటిజన్లు..
ప్రతీ నాయకుడి వద్ద కోట్ల రూపాయలు ఉండి ఉంటాయి. వారికి ఐఫోన్ ప్రో పెద్ద విషయమేమీ కాదు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఐఫోన్లు ఇస్తే ఒక్కో ఐఫోన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,19,900 గా ఉంది. అంటే మొత్తం 70 మందికి కలిపి రూ.83,93,000 వరకు కావచ్చు ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదని కొందరంటే.. ఇప్పటికే చాలా మంది నాయకుల వద్ద ఐఫోన్ ప్రో ఉండి ఉంటుంది. ఇది వారికి పెద్ద విషయం కాదు.. ఐ ఫోన్ 17 వస్తే ఇవి కూడా పక్కన పడేస్తారు. అలాంటి నాయకులకు ప్రజాధనంతో కొనివ్వడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఏది ఏమైనా ఐఫోన్ అసెంబ్లీలో మంట పెడుతుందని తెలుస్తుంది.