• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆత్మీయ ఆలింగనం... పవన్ -...

ఆత్మీయ ఆలింగనం... పవన్ - బొత్స మధ్య ఆసక్తికర సన్నివేశం!

| ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ సందడి జరుగుతోంది.

By - Tupaki Desk
Update: 2024-11-22 06:22 GMT

మీడియా ముందు సమావేశాల్లో అయినా.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లో అయినా.. నేతల్లో అయినా, కార్యకర్తల్లో అయినా.. ఉప్పు - నిప్పు, మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గు అన్నట్లుగా ఉండే రెండు రాజకీయ పార్టీలుగా చెప్పే వైసీపీ, జనసేన లకు చెందిన నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే...?

అవును... వైసీపీ - జనసేన మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందని.. వైసీపీ పతనమే పవన్ లక్ష్యమని.. రకరకాల కామెంట్లు వినిపిస్తూ, వాటిని బలపరిచే పలు సంఘటనలు తెరపైకి వస్తున్నాయని చెబుతోన్న వేళ అసెంబ్లీ ప్రాంగణంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ సందడి జరుగుతోంది. ఇది సాంప్రదాయం ప్రకారం వైసీపీకి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు అంటుంటే... చంద్రబాబు మాత్రం ఎన్నికలకు తెరలేపి మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు! దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇంత రసవత్తర సమయంలో.. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందులో భాగంగా.. పీఏసీ ఎన్నిక వేళ.. ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ - వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎదురుపడ్డారు. ఈ సమయంలో పవన్ ను బొత్స ఆప్యాయంగా పలకరించారు!

అనంతరం ఇద్దరూ అత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు కొన్ని క్షణాల పాటు పలకరించుకుని, నవ్వుకుని.. ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఇలానే ఉండేవారని.. కాకపోతే ఇప్పుడు పార్టీల వారీగా బద్ద శత్రువులుగా మారిపోయారని అంటున్నారు!

అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం...

మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణను ఆలింగనం చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్#PawanKalyan #BotsaSatyanarayana #Janasena #YSRCP #APAssembly #AndhraPradesh #Tupaki pic.twitter.com/WrFMNJbXOf

— Tupaki (@tupaki_official) November 22, 2024
Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Jaganmohanreddy 
  • Chandrababu 
  • ApCM 
  • Pawankalyan 
  • DeputyCM 
  • Botsasatyanarayana 
  • Assembly 
  • PublicAccountsCommittee 
  • PAC 
  • PACelections 
  • Viralvideo 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

Copyright @2026

Powered by Blink CMS