• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇక మీ ఆటలు సాగవు.. ఇన్...

ఇక మీ ఆటలు సాగవు.. ఇన్ స్టాగ్రామ్ మీ వయసును కనిపెట్టేస్తుంది

| ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారా ? అయితే మీ వయసు గురించి అబద్ధం చెబితే ఇక మీదట కుదరదు.

By - Tupaki Desk
Update: 2025-04-22 07:58 GMT

ఇన్ స్టాగ్రామ్ వాడుతున్నారా ? అయితే మీ వయసు గురించి అబద్ధం చెబితే ఇక మీదట కుదరదు. పిల్లలు తమ నిజమైన వయసును దాచిపెట్టి సైన్ అప్ చేస్తున్నారని గుర్తించిన ఇన్ స్టా గ్రామ్ అలాంటి వారిని పసిగట్టేందుకు ఒక పవర్ ఫుల్ ఏఐ టూల్ ను రంగంలోకి దించింది. ఈ టూల్ ఎలా పనిచేస్తుంది? టీనేజర్లను ఎలా గుర్తిస్తుంది లాంటి వివరాలను తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొంత కాలంగా ఇన్‌స్టా ఈ ఏఐ టూల్‌ను ఉపయోగిస్తోందని, ముఖ్యంగా టీనేజర్లు తమ వయసును ఎక్కువగా చూపి అకౌంట్ క్రియేట్ చేస్తే వెంటనే ఈ టూల్ అలాంటి వారిని గుర్తించి టీన్ అకౌంట్ గా మారుస్తుందని తెలిపింది.

ఈ టీన్ అకౌంట్‌లకు పెద్దల ఖాతాల కంటే ఎక్కువ లిమిట్స్ ఉంటాయి. అపరిచితుల నుండి వచ్చే ప్రైవేట్ మెసేజ్ లను పరిమితం చేయడం, సెన్సెటివ్ కంటెంట్ చూడకుండా ఆంక్షలను విధించడంతో పాటు అప్పటికే ఫాలో అవుతున్న వ్యక్తుల నుంచి మాత్రమే మెసేజ్‌లను రిసీవ్ చేసుకునేలా అకౌంట్ ను మారుస్తుంది.

అంతే కాకుండా ఈ ఖాతా యూజర్లు 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటే వారికి నోటిఫికేషన్లతో కూడిన హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నోటిఫికేషన్లు ఆగిపోతాయి. అంతేకాకుండా, డైరెక్ట్ మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లైలు పంపే 'స్లీప్ మోడ్' ఆప్షన్ కూడా దాని కదే యాక్టివేట్ అవుతుంది.

టీన్ ఖాతాలకు సంబంధించిన ఈ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు కూడా నోటిఫికేషన్ల రూపంలో పంపి వారు తమ పిల్లలతో ఏ విధంగా సంభాషణలు జరుపవచ్చన్న విషయాలను కూడా మెటా తెలుపుతుంది. సోషల్ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయనే విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పిల్లలను సురక్షితంగా ఉంచాలనే డిమాండ్ల మధ్య మెటా ఈ తరహా చర్యలు చేపట్టింది.

Tags:    
  • Instagram 
  • Meta 
  • AITechnology 
  • TeenSafety 
  • SocialMediaUpdate 
  • DigitalWellbeing 
  • OnlinePrivacy 
  • TeenAccounts 
  • FakeAgeDetection 
  • SocialMediaAI 
  • InstaSafety 
  • ParentalControls 

Similar News

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS