ఇండిగో క్రైసిస్ : ఆ రూల్స్ వల్లే ఈ ఇబ్బందులు...ఐటా హెడ్ విల్లీ వాల్ష్ కామెంట్స్...

ఇన్ని విమానాలు రద్దు చేసి ప్రయాణికుల్ని నానా ఇబ్బందికి గురి చేసిన ఇండిగో తీరుకు.... భారత్ విధించిన కొత్త నిబంధనలే కారణమంటూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐటా) డైరెక్టర్ విల్లీ వాల్ష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-12-11 05:17 GMT

ఇండిగో సంక్షోభ ప్రకంపనల ప్రభావం మనదేశమే కాదు విదేశాలకు పాకింది. ఇన్ని విమానాలు రద్దు చేసి ప్రయాణికుల్ని నానా ఇబ్బందికి గురి చేసిన ఇండిగో తీరుకు.... భారత్ విధించిన కొత్త నిబంధనలే కారణమంటూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐటా) డైరెక్టర్ విల్లీ వాల్ష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలట్ల కోసం తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని, ఇతర దేశాల్లో ఇంత కఠినంగా రూల్స్ లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ రెండోదశ అమలుకు సరిపడా సిబ్బందిని నియమించుకోనందుకే ఇండిగో ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వందలాది విమానాలు రద్దయి సగటు ప్రయాణికులు విలవిల్లాడిపోయారు. ఈ సంక్షోభం పార్లమెంట్ భవనాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల వాదనలకు ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేకపోయింది. చివరికి హైకోర్టు కూడా సంక్షోభంలో ఇష్టారీతిగా ఇతర విమాన సంస్థలు టికెట్ల ధరను పెంచుకోడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నియంత్రించాల్సిన ప్రభుత్వం నిస్సహాయంగా ఉండిపోవడం సరికాదని తెలిపింది.

విమానయాన ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నియంత్రణ సంస్థలదే. ఏదైనా మార్పు అవసరమైనపుడు సరైన సన్నద్ధత ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు పరిశీలించాకే అమలు చేయాలి. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు మేం కొత్త రూల్స్ పెట్టేశాం...అమలు చేయండి అంటే...సరిపడా సిబ్బంది ఉందా లేదా అని సదరు సంస్థలకు కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి. కేంద్ర పౌరవిమానయాన విభాగం అలా వ్యవహరించిందా అన్న వాదనలు ఇపుడు వినవస్తున్నాయి.

పైలట్లను అలసట నుంచి తప్పించేందుకు అమలు చేయాల్సిన సరైన చర్యలపై ఐరోపా, అమెరికాల్లో నిరంతరం చర్చ జరుగుతునే ఉంటుందని జెనీవాలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విల్లీ వాల్ష్ అన్నారు. భారత్ రాత్రిపూట సర్వీసుల వల్ల పైలట్లకు ఎదురవుతున్న అలసటను దూరం చేయాలనుకుంది. అయితే తక్కువ ధరలకు సర్వీసులు అందిస్తున్న విమాన సంస్థలపై ఇది ప్రభావం చూపుతోందని వాల్స్ అబిప్రాయపడ్డారు. సిబ్బందికి విశ్రాంతి ఇవ్వాలంటే...సంఖ్య పెంచాలి...సంఖ్య పెరిగితే నిర్వహణ భారం...దాని ప్రభావం టికెట్లపై పడుతుంది. అందుకే భారత్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తక్కువ ధరలకే సర్వీసు ఇస్తున్న ఇండిగో సంక్షోభంలో కూరుకుపోయిందని వాల్ష్ అన్నారు. కాగా ఐటాలో 360 విమాన సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఇండిగో ,ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ కు సభ్యత్వాలున్నాయి.


Tags:    

Similar News