• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తురుపుముక్కల్లాంటి...

తురుపుముక్కల్లాంటి అమెరికా భారతీయుల్లో ఈ డాక్టర్ ఓ కలుపు మొక్క

| రహస్య కెమెరాలతో ఇతడు సాగించిన బాగోతంలో చిన్నారులు కూడా బాధితులు కావడం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2024-08-21 12:56 GMT

నగ్న చిత్రాలు సీక్రెట్ గా రికార్డ్ చేసిన ప్రవాస భారతీయ వైద్యుడి నీచం బయటపడింది. ఓపక్క అమెరికా ప్రగతిలో ప్రవాస భారతీయులు వెన్నెముకగా నిలుస్తుంటే.. ఇలాంటి వారు కలుపు మొక్కగా మిగిలిపోతున్నారు. రహస్య కెమెరాలతో ఇతడు సాగించిన బాగోతంలో చిన్నారులు కూడా బాధితులు కావడం గమనార్హం. చివరకు ఆ నీచుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.

కొన్నేళ్ల నుంచి దారుణం..

భారత్‌ కు చెందిన డాక్టర్ ఒయిమెయిర్‌ ఎజాజ్‌ 2011లో వర్క్‌ వీసా మీద అమెరికా వెళ్లాడు. కొన్నాళ్లు అలబామాలో ఉన్నాడు. 2018లో మిషిగాన్‌ కు మారాడు. ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, మొదట్లో మంచిగానే ఉన్న అతడి బుద్ధి తప్పుదారి పట్టింది. అతడిలోని వికృత రూపం బయటపడింది. తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లోని గదులు, బాత్రూమ్‌లు, చేజింగ్‌ ఏరియాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి మహిళలు, పిల్లల నగ్న వీడియోలను రికార్డ్‌ చేశాడు. కొన్నేళ్ల పాటు దీనిని సాగివంచాడు.

పట్టించింది భార్యనే..

డాక్టర్ ఎజాజ్ ఆగడాలతో అతడి భార్య విసుగెత్తింది. ఆమె ఫిర్యాదుతోనే ఎజాజ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. వీడియోలను కూడా ఆమెనే పోలీసులకు ఇచ్చింది. ఇటీవల ఆక్లాండ్‌ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఎజాజ్.. మహిళలు స్పృహలో లేనప్పుడు అభ్యంతరకంగా కూడా ప్రవర్తించేవాడని తేలింది. చివరకు దానినీ రికార్డు చేసేవాడట. రోగులను లైంగిక వేధించేవాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆగస్టు 8న పోలీసులు ఎజాజ్ ను అరెస్టు చేశారు. తన ఇంట్లో సోదా చేయగా విస్తుపోయారు. కంప్యూటర్‌, ఫోన్లు, 15 ఎక్స్‌టర్నల్‌ స్టోరేజీ డివైజ్‌ లలో వేలాది అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఒక సింగిల్‌ హార్డ్‌ డ్రైవ్‌ లోనే 13వేల వీడియోలు బయటపడ్డాయి. క్లౌడ్ లోనూ వీటిని అప్‌ లోడ్‌ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఎజాజ్ బాధితుల సంఖ్య చాలా ఎక్కువ ఉండడంతో పూర్తిస్థాయి దర్యాప్తునకు నెలల తరబడి సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

Tags:    
  • Indian 
  • America 
  • Doctor 
  • Clinic 
  • CCcamera 
  • HiddenCamera 
  • DrEjaz 
  • DrEjazWife 
  • Michigan 
  • OaklandCountyPolice 
  • Ajay 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS