అమెరికాలో ఇవేం పాడు పనులు.. పరువు తీసిన భారత యువతి.. వైరల్ వీడియో
ఇలాంటి సమయంలో అమెరికాలో చదువుకునే కొంతమంది యువత ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;
అమెరికా వెళ్లాలని లక్షలాది మంది భారతీయ యువత కలలు కంటారు. ఉన్నత విద్య, మంచి ఉపాధి అవకాశాలు, స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023–24లో అమెరికాలో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య 3.32 లక్షలకు చేరింది. అలాగే 2023లో గ్రీన్‌కార్డ్ పొందిన వారిలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక H-1B వీసాల విషయంలో 80 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు.
ఇలాంటి సమయంలో అమెరికాలో చదువుకునే కొంతమంది యువత ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికా ట్రైన్‌లో ఓ భారతీయ అమ్మాయి బహిరంగంగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన వీడియో వైరల్‌గా మారింది. చుట్టూ ఉన్న అమెరికన్లు ప్రశాంతంగా ప్రయాణిస్తుంటే, ఆమె మాత్రం అడ్డంగా డ్యాన్స్ చేస్తూ విచిత్రమైన స్టెప్స్ వేసింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా షేర్ అవుతూ, విమర్శలకు తావిస్తోంది.
నెటిజన్లు ఆమె ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “భారత్ పరువు తీస్తుంది”, “అప్పులు చేసి అమెరికా పంపిస్తే ట్రైన్స్‌లో రీల్స్ చేస్తారా?”, “మీ లాంటి వాళ్ల వల్లే వీసా ధరలు పెరిగాయి” అంటూ మండిపడుతున్నారు. మరికొందరు ఆమెను వెంటనే ఇండియాకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రవర్తనగా దీన్ని పేర్కొంటున్నారు.
ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న సంచలన నిర్ణయం దీనికి మరింత రంగు పులిమింది. తాజాగా హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు (సుమారు రూ.83 లక్షలు) పెంచే నూతన నిబంధనలను ప్రకటించారు. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్నాలజీ రంగానికే కాకుండా, హెచ్1బీ వీసాలపై ఆధారపడిన భారతీయ ఐటీ రంగానికి తీవ్రంగా దెబ్బతీయనుందని నిపుణులు అంటున్నారు.
సమాజంలో చర్చ
అమెరికాలో చదువుకునే లేదా ఉద్యోగాలు చేస్తున్న భారతీయ యువత ప్రవర్తనపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.వ్యక్తిగత చర్యలు దేశ ప్రతిష్టను ప్రభావితం చేస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ట్రంప్ తీసుకున్న ఫీజు పెంపు నిర్ణయానికి కూడా ఈ తరహా ఘటనలు ఒక కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా, అమెరికా ట్రైన్‌లో ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వినోదం కంటే ఎక్కువగా జాతీయ గౌరవం, వీసా విధానాలు, యువత ప్రవర్తనలపై చర్చను రగిలించింది.