విశాఖ‌కు మ‌రో దుర్వార్త‌.. అమెరికా దాడిలో ఉద్యోగి మృతి.. సీఎం చంద్ర‌బాబు షాక్‌!

భార‌త్‌కు ఇంధ‌నాన్ని తీసుకువ‌స్తున్న నౌక‌లో చీఫ్ ఇంజ‌నీర్‌గా ఉన్న సురేష్‌... తాజాగా అమెరికా సైన్యం జ‌రిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

Update: 2026-06-12 17:55 GMT

విశాఖ‌ప‌ట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో ఇటీవ‌ల పెను ప్ర‌మాదం సంభ‌వించి.. ప‌లువురు మృతి చెందిన ఘ‌ట‌న న‌గ‌రాన్ని తీవ్ర విషా దంలో ముంచేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌.. నుంచి న‌గ‌రం ఇంకా తేరుకోకముందే.. ఇదే ప్రాంతానికి చెందిన ఓ నేవీ ఉద్యోగి, యువ‌కుడు అమెరికా సైన్యం జ‌రిపిన దాడిలో మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని.. వారి ఆవేద‌న తీర్చ‌లేక‌పోయినా.. అన్ని రూపాల్లోనూ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని..తెలిపారు.

ఎవ‌రు? ఏం జ‌రిగింది?

విశాఖ‌ప‌ట్నం న‌గ‌రానికి చెందిన 44 ఏళ్ల‌ ప‌ట్నాల సురేష్‌.. భార‌త నేవీలో చీఫ్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్నారు.. అయితే.. గ‌ల్ఫ్ నుంచి భార‌త్‌కు చ‌మురు తీసుకువస్తున్న నౌక‌ల్లో ఆయ‌న విధులు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో హోర్ముజ్ జ‌ల‌సంధిపై ఇరాన్ ప‌ట్టుబిగించింది. దీంతో అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఇరాన్‌పై మ‌రిన్ని దాడులు జ‌రుపుతోంది. ఇలా.. ప‌ర‌స్ప‌రం హోర్ముజ్ జ‌ల‌సంధిపై ప‌ట్టుకోసం.. జ‌రుపుకొంటున్న దాడుల‌తో ఇంధ‌న ర‌వాణా నిలిచిపోయింది.

రెండు రోజుల్లో పెళ్లి రోజు..

భార‌త్‌కు ఇంధ‌నాన్ని తీసుకువ‌స్తున్న నౌక‌లో చీఫ్ ఇంజ‌నీర్‌గా ఉన్న సురేష్‌... తాజాగా అమెరికా సైన్యం జ‌రిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. సురేష్‌కు భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. సురేష్ మ‌ర‌ణ వార్త తెలిసి.. వారంతా తీవ్ర ఆవేద‌న‌లో మునిగిపోయారు. కాగా.. ఈ నెల 15న సురేష్ పెళ్లిరోజు జ‌రుపుకొనేందుకు త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని.. ప‌రిస్థితులు అనుకూలంగానే మారుతున్నాయ‌ని భార్య‌కు చెప్పిన రెండో రోజే.. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఆమె ఇంకా ఆవేద‌న‌లో కూరుకుపోయారు.

హుటాహుటిన స్పంద‌న‌..

సురేష్ మ‌ర‌ణ వార్త‌.. తెలిసిన వెంట‌నే సీఎం చంద్ర‌బాబు హుటాహుటిన స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో ఆయ‌న చ‌ర్చించారు. మ‌రోవైపు.. జిల్లా అధికారుల‌తో మాట్లాడి.. సురేష్ కుటుంబాన్ని ఓదార్చాల‌ని.. సూచించారు. ద‌గ్గ‌ర‌లో ఉ న్న మంత్రులు త‌క్ష‌ణ‌మే సురేష్ ఇంటికి వెళ్లి.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం చెప్పాల‌న్నారు. ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద న్నారు. ఇక‌, ఇదే విష‌యంపై స్పందించిన మంత్రి లోకేష్‌.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేష్‌ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. కేంద్రంతో నిరంత‌రం సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని లోకేష్ తెలిపారు.

Tags:    

Similar News