చైనా పొమ్మంది.. భార‌త్ ర‌మ్మంది.. అమెరికాతో కీల‌క ఒప్పందం!

భార‌త్‌-అమెరికాల మ‌ధ్య కీల‌క ఒప్పందం కుద‌ర‌నుంది. ఈ విష‌యాన్ని అమెరికా రాయ‌బారి సెర్గియో గోర్ వెల్ల‌డించారు.;

Update: 2026-03-13 18:30 GMT

భార‌త్‌-అమెరికాల మ‌ధ్య కీల‌క ఒప్పందం కుద‌ర‌నుంది. ఈ విష‌యాన్ని అమెరికా రాయ‌బారి సెర్గియో గోర్ వెల్ల‌డించారు. ఈ ఒప్పందం.. క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌కు సంబంధించింద‌ని చెప్పారు. అరుదైన భూఖ‌నిజాలు భార‌త్‌లో ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వాటిపైనే ఈ ఒప్పందం కుద‌ర‌నుంద‌ని తెలిపారు. ఈ ఒప్పందం ద్వా రా అమెరికా-భార‌త్ ప‌ర‌స్ప‌ర ద్వైపాక్షిక ఒప్పందాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయ‌ని.. గోర్ వెల్ల‌డించారు. ఇరు దేశాల స‌హ‌కారం కూడా మ‌రింత పెరుగుతుంద‌న్నారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ఈ క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ విష‌యంలో నిన్న మొన్న‌టి వ‌రకు అమెరికా చైనాతో నే ఒప్పందం చేసుకుంది. కానీ, ఇటీవ‌ల కాలంలో చైనా దూకుడు పెంచింది. ముఖ్యంగా ట్రంప్ వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌మ దేశంపై సుంకాల‌ను పెంచ‌డాన్ని డ్రాగ‌న్ దేశం త‌ట్టుకోలేక పోతోంది. ఈ నేప‌థ్యంలో క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ ఒప్పందాన్ని ఇటీవ‌ల వెన‌క్కి తీసుకుంది. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే ఉన్న ఒప్పందాన్ని కూడా కుదించుకుంది.

ఈ నేప‌థ్యంలోనే అమెరికా ఇప్పుడు భార‌త్‌తో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ ఒప్పందం ఫ‌లితంగా భార‌త త‌యారీ రంగానికి 30 శాతం మేర‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని అంటున్నారు. అయితే.. వాస్త‌వ ప్ర‌యోజ‌నం మాత్రం అమెరికాకు మాత్ర‌మే ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందం అత్యంత కీల‌క‌మ‌ని అంటున్నారు. ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని సూచిస్తున్నారు.

ఎఫ్‌-35 కోస‌మే!

క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌ను ఎక్కువ‌గా అమెరికా త‌యారు చేస్తున్న ఎఫ్‌-35 యుద్ధ విమానాల‌ను రూపొందించేం దుకు వినియోగిస్తున్నారు. సెన్సార్ల నుంచి ఇంజ‌న్ భాగాల వ‌ర‌కు కూడా క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్‌ను వినియో గిస్తారు. ఎఫ్‌-35 విమానాల‌ను ఒక్క అమెరికా మాత్ర‌మే త‌యారు చేసి.. ప్ర‌పంచంలోని మిత్ర దేశాల‌కు విక్ర యిస్తుంది. అంతేకాదు.. వీటిని వినియోగించుకునే అంశంపైనా అమెరికా ఇష్టానికే ఒప్పందాలు ఉంటా యి. ఇలా.. ఎఫ్‌-35 కోస‌మే వినియోగిస్తున్న క్ర‌మంలోనే చైనా ఈ ఒప్పందాన్ని త‌గ్గించింది.

Tags:    

Similar News