ఇక ఏ ఉగ్ర దాడైనా.. అది ’యుద్ధమే’.. భారత్ సంచలన నిర్ణయం

గతంలో ఉగ్రదాడి జరిగితే.. భవిష్యత్తులో ఇక మీదట జరగకుండా సరిహద్దుల్లో, దేశంలో అంతర్గతంగా భద్రతను పటిష్ఠం చేసేవారు భారత పాలకులు..;

Update: 2025-05-10 12:21 GMT

గతంలో ఉగ్రదాడి జరిగితే.. భవిష్యత్తులో ఇక మీదట జరగకుండా సరిహద్దుల్లో, దేశంలో అంతర్గతంగా భద్రతను పటిష్ఠం చేసేవారు భారత పాలకులు..

మరికొన్నిసార్లు ఉగ్రదాడికి ప్రతి దాడి అనేవిధంగా బదులివ్వడం చూశాం.. ఇప్పుడు మాత్రమే ఏకంగా శత్రుదేశం పాకిస్థాన్ భూభాగంపైకి దాడులు చేస్తోంది.. దీనిని యుద్ధంగానూ అభివర్ణించవచ్చు.

ఉగ్రదాడికి ఇకమీదట మాత్రం కథ మామూలుగా ఉండదు అని తెలుస్తోంది. దీనికి కారణం.. భారత్ పై జరిగే ప్రతి ఉగ్ర దాడిని ఇకపైన ’యుద్ధం’గానే పరిగణిస్తాం అని కేంద్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది.

ఏమిటీ ఈ నిర్ణయం ప్రభావం?

ఇప్పటివరకు యుద్ధం అంటే.. సరిహద్దుల్లో దురాక్రమణ అనంతరమే చేసేది. చైనాలాంటి దేశాలు అయితే.. దురాక్రమణ కోసం చేసేది. అయితే, ఉగ్రవాద ప్రభావిత ఇజ్రాయెల్ వంటి దేశాలు చాలాసార్లు మినీ యుద్దాలే చేశాయి.

భారత్ తాజాగా తమ మీద జరిగే ప్రతి ఉగ్రదాడిగా పేర్కొనడం అంటూ జరిగితే.. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్ కు సంకేతం పంపడమే. చర్యకు ప్రతిచర్య కాదు.. తీవ్ర ప్రతిచర్య అన్నమాట.

ఒక విధంగా చెప్పాలంటే.. ఉగ్రదాడిని కారణంగా చూపుతూ భారత్ తీవ్ర స్థాయిలో దాడులకు దిగుతుంది. అది యుద్ధంగా మారుతుంది. ఇది బంగ్లాదేశ్ వంటి దేశాలకు పరోక్ష హెచ్చరికనే.

కాగా, తాజాగా పాకిస్థాన్ పై చేస్తున్న యుద్ధం బ్రీఫింగ్ ను ప్రతి రోజూ సాయంత్రం మీడియాకు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని రక్షణ, విదేశాంగ శాఖలు సంయుక్తంగా విడుదల చేస్తున్నాయి. ఈ సమావేశంలో కీలక విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News