ప్రపంచ ఉగ్రవాదానికి కేరాఫ్ పాక్...భారత్ రీసౌండ్ అదుర్స్
పాకిస్థాన్ కి ఎక్కడ మాడు మీద కొట్టాలో అక్కడే భారత్ కొట్టింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ పాక్ ఉగ్ర విశ్వరూపాన్ని ప్రపంచం ముందు ఉంచింది.;
పాకిస్థాన్ కి ఎక్కడ మాడు మీద కొట్టాలో అక్కడే భారత్ కొట్టింది. ఐక్యరాజ్యసమితిలో భారత్ పాక్ ఉగ్ర విశ్వరూపాన్ని ప్రపంచం ముందు ఉంచింది. కేవలం భారత్ మాత్రమే ఉగ్ర బాధితురాలు కాదని ప్రపంచం మొత్తం బాధితురాలే అని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్ లోనే ఉన్నాయని తేల్చి చెప్పింది. పాక్ ఉగ్రవాదానికి కేరాఫ్ గా మారింది అని విరుచుకుపడింది.
ఐక్య రాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తన బలమైన వాదనలతో దాయాది నోరు గట్టిగా మూయించారు. పాకిస్తాన్ తో భారత్ గత నాలుగు దశాబ్దాలుగా పడుతున్న అవస్థలు ఆయన ప్రపంచం ముందు ఉంచారు. ఉగ్ర దాడులను సరిహద్దులలో పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని దానిని బలమైన ఆధారాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.
అంతే కాదు పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిస్తూ వేలాదిగా భారతీయులను ఉగ్రవాదంతో పొట్టన పెట్టుకుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల కాలంలో ఇరవై వేల మందికి పైగా భారతీయ పౌరులు ఉగ్రదాడులకు బలి అయ్యారని చెప్పారు. పాక్ తన తీరుని మార్చుకోవడం లేదని అందుకే ఆపరేషన్ సిందూర్ లాంటి సైనిక చర్యలకు భారత్ దిగాల్సి వచ్చిందని చెప్పారు.
ఇప్పటికి ఆరున్నర దశాబ్దాల క్రితం కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి పాక్ వైఖరే కారణం అన్నారు. స్నేహం పరస్పర విశ్వాసం పునాదుల మీద ఈ ఒప్పందం కుదిరిందని అన్నీ ఉల్లంఘించిన పాక్ తో ఇక ఒప్పందాలు ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. సింధు జలాల విషయంలో ఒప్పందాలు కుదిరాక కూడా భారత్ తో పాక్ మూడు ప్రత్యక్ష యుద్ధాలను చేసిందని ఆయన గుర్తు చేశారు.
అయినా గత నలభై ఏళ్ల కాలంలో భారత్ చూపించిన ఉదార స్వభావం, సహనం, మంచితనం అన్నవే ఈ ఒప్పందాన్ని కొనసాగించాయని అన్నారు. ఇక పహిల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ తప్పని పరిస్థితులలో ఆపరేషన్ సింధూర్ తో పాక్ ని కట్టడి చేయాల్సి వచ్చిందని అన్నారు.
సింధూ జనాల విషయంలో పాక్ చేస్తున్న తప్పుడు వాదనను ఆయన ఐక్య రాజ్య సమితిలో ఎండగట్టారు. సింధూ జలాల ఒప్పందం పున సమీక్ష జరగాలీ అంటే పాక్ వైఖరిలో గణనీయమైన మార్పు రావాల్సిందే అని అన్నారు. ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వకుండా తన నిబద్ధతను చాటుకోవాలని ఆయన కోరారు.
పాక్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేసేంతవరకూ ఈ ఒప్పందం రద్దు కాదని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు చూస్తే భారత్ ఎగువన ఉన్న దేశంగా ఏనాడూ భావించలేదని మానవతా దృష్టితో పాక్ కి నదీ జలాల ఒప్పందం ద్వారా నీరు అందించిందని గుర్తు చేశారు. అయినా పాక్ మాత్రం భారత్ ని కవ్విస్తూనే ఉందని ఆయన అన్నారు.
మరఒ వైపు చూస్తే పారే నీరు ఒక జీవమని దానికి యుద్ధానికి ఆయుధంగా భారత్ వాడుకుంటోందని అంటూ సింధు నదీ జలాల ఒప్పందం విషయాన్ని ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రతినిధి లేవనెత్తారు. అయితే అది తప్పుడు ప్రచారం అని భారత్ తరఫున హరీష్ బలంగా వాదించారు.
భారత్ ని ఆర్ధికంగా ఇతరత్రా ఇబ్బందుల పాలు చేయాలని పాక్ చూసింది నిజమని ఆయన అన్నారు. అదే సమయంలో భారత పౌరుల జీవితాలు, మత సామరస్యం తీవ్రంగా దెబ్బ తీసేలా పాక్ వ్యవహరించిందని దానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుందని ఆయన విమర్శించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ కాదు పాకిస్థాన్ అని గట్టిగా ఆయన చెప్పగలిగారు. దాంతో ఐక్య రాజ్యసమితిలో భారత్ బలమైన వాదనతో పాక్ కి ముఖం మీదనే దెబ్బ కొట్టినట్లు అయింది అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.