పెద్దల సభకు తెలంగాణ నుంచి ఎవరో తేలిపోయింది

తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది.;

Update: 2026-03-05 06:36 GMT

తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. రెండు స్థానాల కోసం కాంగ్రెస్ తన అభ్యర్థుల్ని డిసైడ్ చేసింది. దీంతో.. ఈ రేసులో నిలిచిన పలువురు ఆశావాహులకు నిరాశ తప్పలేదు. అభ్యర్థులను డిసైడ్ చేసిన తీరును చూస్తే.. రెండు స్థానాల్లో ఒకటి అధిష్ఠానం తీసుకుంటే.. మరొకటి పూర్తిగా తెలంగాణ సీఎం రేవంత్ చాయిస్ కు ఓకే చెప్పినట్లుగా చెప్పాలి. అదెలా అంటే.. కాంగ్రెస్ కన్ఫర్మ్ చేసిన ఆ ఇద్దరు అభ్యర్తుల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఇంతకూ ఆఇద్దరు ఎవరంటే.. ఒకరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కం రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ కాగా.. మరొకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న వేం నరేంద్ర రెడ్డి. అభిషేక్ మను సింఘ్వీ పేరు మొదట్నించి వినిపిస్తున్నప్పటికి.. రెండో అభ్యర్థికి సంబంధించి మాత్రం పలు పేర్లు వినిపించాయి.

చివరకు సీఎం రేవంత్ కోటాకు కాంగ్రెస్ అధిష్ఠానం ఓకే చెప్పిందని చెప్పాలి. నిజానికి వేం నరేంద్ర రెడ్డికి కేటాయించిన సీటు కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు చిన్నారెడ్డి, వీహెచ్, వంశీచంద్ రెడ్డి, వినయ్ కుమార్చ జెట్టి కుసుమకుమార్ తదితరుల పేర్లు వినిపించినా.. సీఎం రేవంత్ విన్నపానికి కాంగ్రెస్ అధిష్ఠానం విలువను ఇచ్చిందని చెప్పక తప్పదు. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. వేం నరేంద్రరెడ్డిని ముఖ్యమంత్రి సలహాదారుగా బాధ్యతలు అప్పజెప్పటం తెలిసిందే. ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు.. రాజ్యసభ అభ్యర్ధిగా డిసైడ్ చేయటం గమనార్హం.

వేం విషయానికి వస్తే మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ నేత.. సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది. 2004లో మహబూబాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో హనుమకొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగి దెబ్బ పడింది. రేవంత్ సర్కారు కొలువు తీరిన వెంటనే.. ప్రధాన సలహాదారు నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం ద్వారా సీఎం రేవంత మాటకు కాంగ్రెస్ అధినాయకత్వం ఎంతటి విలువను. గౌరవాన్ని ఇస్తుందన్న విషయం మరోసారి అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News