ఓవరాక్షన్ కాకుంటే.. పాక్ కు వెళ్లే వేళ ఈ మాటలా?

ఎంత భావోద్వేగంలో అయినా సరే.. ఈ దారుణ పరిస్థితికి కారణం తమ దేశ ప్రభుత్వమే అన్న ఇంగితాన్ని మర్చిపోయే వాళ్లను ఏమనాలి?;

Update: 2025-04-27 06:30 GMT

ఓపక్క నిర్దయగా ఒక దేశ ప్రజల ప్రాణాలు తీస్తున్న దేశానికి చెందిన పౌరుల ప్రాణాల్ని కాపాడాల్సిన ధర్మం ప్రపంచంలో మరెక్కడా ఉండదు. తమ దేశం చేసే తప్పులకు సదరు దేశస్తులు మూల్యం చెల్లించక తప్పదు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి.. ఇంతకాలం భారత్ అతిధ్యాన్ని అందుకొని.. తిరిగి వెళ్లే వేళలోనూ భారత్ మీద నిందలు వేసే అతి బ్యాచ్ ను ఏమనాలి? ఎలా చూడాలి. ఎంత భావోద్వేగంలో అయినా సరే.. ఈ దారుణ పరిస్థితికి కారణం తమ దేశ ప్రభుత్వమే అన్న ఇంగితాన్ని మర్చిపోయే వాళ్లను ఏమనాలి?

దాడికి పాల్పడింది ఉగ్రవాదులు.. శిక్షించాల్సింది వాళ్లనే కానీ ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షించటం? అంటూ భారత్ లో ఉండి తాజాగా తమ దేశానికి వెళ్లే వేళలో పాకిస్తానీయులు వేస్తున్న ప్రశ్నలు దేనికి నిదర్శనం? కనికరం అన్నది లేకుండా అమాయకులు ప్రాణాలు తీసేసిన తమ దేశానికి చెందిన ఉగ్రవాదులను పాకిస్తానీయులు ఎలా వెనకేసుకొని వస్తారు? అంతదాకా ఎందుకు పహల్గాం ఉగ్రఘటన తర్వాత పాక్ లోని ప్రభుత్వం.. అక్కడి నేతల రియాక్షన్ చూసిన తర్వాత అయినా మన దేశంలో ఉన్న పాకిస్తానీయుల తీరు మారాలి కదా? ఒకవేళ.. ఎవరి దేశం వారికి ముఖ్యం అన్న పాయింట్ విషయానికి వచ్చినప్పుడు.. నోరు మూసుకొని తమ దేశానికి వెళ్లకుండా.. నీతి బోధలు ఏల? అన్నది మరో ప్రశ్న.

తాము పాక్ లో పుట్టటమే నేరమా? అంటున్న వారు.. గుర్తించాల్సిన అంశం ఏమంటే.. అవును.. నిజమే కదా? అన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్య చర్యల ద్వారా శాంతియుత వాతావరణాన్ని కొందరు పాకిస్తానీయులు కోరుకోవటం చూస్తే.. ఒళ్లు మండక మానదు. వాళ్ల దేశానికి చెందినోళ్లు మనోళ్లను కనికరం లేకుండా చంపేస్తుంటే.. అందుకు ఎలాంటి మూల్యం చెల్లించని దాయాదితో శాంతి చర్చలు ఎందుకు జరపాలి?

అనారోగ్య కారణాలతో ప్రతి నెల వందలాది మంది పాక్ జాతీయులు భారత్ కు వచ్చి చికిత్స చేయించుకొని వెళుతుంటారు. అలాంటి వారిలోకొందరు తాజాగా తమ దేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. ‘‘పహల్గాం ఘటనకు ముందు వరకు స్థానికులు తమతో బాగానే ఉండేవారని.. ఆ తర్వాత వారి తీరులో మార్పు వచ్చింది’’ అని పాక్ జాతీయుల నోటి నుంచి వచ్చిన మాటల్ని చూసినప్పుడు.. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంటి అల్లుళ్ల మాదిరి ట్రీట్ చేయలేం కదా? అన్న మాట బలంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పాలి.

Tags:    

Similar News