వైసీపీలో గుసగుస : లింక్ లేకుండా విక్టరీ ఎలా ?

ప్రతీ రోజూ క్యాడర్ కి లీడర్ కి అధినాయకత్వం అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల మీద తాము ముందుండి పోరాడుతూ పార్టీ నేతలను ఉత్సాహపరచాలని దిశా నిర్దేశం చేయాలని అంటున్నారు.;

Update: 2026-03-14 03:30 GMT

ఎన్నికలు పెట్టడమే ఆలస్యం గెలిచేది మేమే అని వైసీపీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. అసలు క్యాలెండర్ లో 2026 నంబర్ ఉంది కానీ 2029 అయితే ఎంత బాగుండు అని కూడా అంటున్నారు. జస్ట్ కాలంలో మార్పు క్యాలెండర్ లో చేంజ్ ఇదే జరగాలి. అంతే తప్ప మిగిలినది అంతా ఓకే. 2029 లో వైసీపీ విక్టరీ డిసైడ్ అయిపోయింది అని రాజకీయ జోస్యాలు చెప్పేస్తున్నారు. నిజానికి చూస్తే వైసీపీలో ఆ పరిస్థితి ఉందా లేక ఏపీ రాజకీయాల్లో ఆ వాతావరణం ఉందా అన్న చర్చ సొంత పార్టీలోనే సాగుతోందిట.

కోటరీ చేతిలోనే :

వైసీపీ ఈ రోజుకీ కోటరీ చేతులోనే ఉందని, అధినాయకత్వాన్ని కీలక సన్నిహిత నేతలు మభ్యపెడుతున్నారని గ్రౌండ్ లెవెల్ లో అంతా బాగుందని నమ్మబలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతోనే ఇక వైసీపీ అధినాయకత్వం కూడా ఫుల్ రిలాక్స్ లో ఉందని అంటున్నారు. వాస్తవ పరిస్థితులు ఈ రోజుకీ హైకమాండ్ కి చేరడం లేదని అంతలా అక్కడ వాతావరణం చూస్తే ఉందని వాపోతున్నారు.

క్యాడర్ తో లింక్ ఏదీ :

ఈ రోజుకీ క్యాడర్ తో లింక్ లేదని భారీ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. అంతే కాదు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక నేతలకు అపాయింట్మెంట్లు దొరకడం సులువు కాదని అంటున్నారు. తమ నియోజకవర్గంలో సమస్యలు చెప్పుకుందామనుకున్నా పార్టీ పరంగా ఏదైనా చెప్పాలనుకున్నా కుదరడం లేదని అంటున్నారు.

విపక్షంలో అలా :

నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పరిస్థితి ఫైర్ మీద ఉండాలని అంటున్నారు. ప్రతీ రోజూ క్యాడర్ కి లీడర్ కి అధినాయకత్వం అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యల మీద తాము ముందుండి పోరాడుతూ పార్టీ నేతలను ఉత్సాహపరచాలని దిశా నిర్దేశం చేయాలని అంటున్నారు. కానీ అటువంటిది ఏదీ లేకపోవడమే కాదు గ్యాప్ చూస్తే అంతకంతకు పెరిగిపోతోంది అని అంటున్నారు.

ఇలాగైతే కష్టమే :

పార్టీలో ధోరణుల పట్ల అయితే చాలా మంది నాయకులు సంతృప్తిగా అయితే లేరని అంటున్నారు. ఇప్పటికీ కోటరీకి చెందిన కొందరు నాయకులు అధినాయకత్వం ముందు ఒకలా చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. వాటి మాటలని నమ్మబట్టే వైసీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 ఎన్నికల్లో 11 సీట్లే వచ్చాయని గుర్తు చేస్తున్నారు. వైసీపీ ఈ 21 నెలలలో క్రియాశీలంగా ఉండాల్సిన తీరులో లేదని గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళి సమస్యల మీద చర్చించాల్సిన పరిస్థితి కూడా లేదని అంటున్నారు.

తక్కువ అంచనా వేస్తూ :

ఇక ఏపీలో కూటమిని తక్కువ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. అక్కడ ఉన్నది మూడు పార్టీలు అని వారంతా కలిస్తే బలం అధికం అన్నది గుర్తు చేసుకోవాల్సి ఉందని అంటున్న్నారు. ఎన్నికలు అంటే పోల్ మేనేజ్మెంట్ అని చెబుతున్నారు. ఆ పని ఒక్కరు చేసేదానికీ ముగ్గురూ కలసి చేసేదానికీ తేడా ఎంతో ఉంటుందని అంటున్నారు ఓటర్లను బూత్ ల దాకా తెచ్చి అనుకూలంగా ఓట్లు వేయించుకునే సమర్ధవంతమైన వ్యవస్థ ఉండాలని, అలాగే వ్యూహాలు ఉండాలని వీటితో పాటు సంఘటిత బలం అధికార బలం కూడా కూటమికి ఉందని అంటున్నారు. ఒంటరిగా వైసీపీ ఓడించాలి అంటే పార్టీలో ఒక్కో కార్యకర్త పది మందిగా మారాలని, అలాగే అధినాయకత్వం కూడా గ్రౌండ్ లెవెల్ లోని వాస్తవాలు చూడాలని క్యాడర్ తో లీడర్లతో కలసి పనిచేసే వాతావరణం ఉండాలని అంటున్నారు.

Tags:    

Similar News