నౌకలకు ఇరాన్ ఓకే చెప్పిన దేశాలెన్ని? ఎన్ని హర్మూజ్ ను దాటేశాయి?

పాకిస్థాన్ కు చెందిన 5-7 నౌకల్ని ఇరాన్ నుంచి క్షేమంగా బయటకు వెళ్లిపోయాయి. ఇరాన్ ఇప్పటవరకు భారత్ మాత్రమే కాదు.. మరో నాలుగైదు దేశాలతోనో చక్కటి సంబంధాల్ని కొనసాగిస్తుందన్నది మర్చిపోకూడదు.;

Update: 2026-03-14 04:13 GMT

యుద్ధం వేళ భారత్ కు రావాల్సిన ముడి చమురు నౌకలు రెండింటిని ఇరాన్ ఓకే చెప్పిందని.. హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా ఎంచక్కా దాటేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ఉదంతం గురించి భారత మీడియా పుంఖాను పుంఖానులుగా వార్తలు రాసేయటం.. ఇరాన్ తో భారత్ కు ఉన్న అనుబంధం ఫెవికిక్ స్థాయిలో ఉన్నట్లుగా నేరేట్ చేయటంతోనే అసలు సమస్య అంతా. ఎందుకంటే.. వాస్తవానికి భిన్నంగా సమాచారం ఉండటం ఇబ్బందికరంగా మారటమే కాదు.. వాస్తవాన్ని గుర్తించే విషయంలోనూ తప్పులు దొర్లుతాయన్నది మర్చిపోకూడదు.

భారత్ కు చెందిన రెండు చమురు నౌకల్ని ఇరాన్ అనుమతించినట్లుగా వార్తలు వస్తున్న వేళ.. మనసులో మరో ప్రశ్న రాక మానదు. హుర్మూజ్ జలసంధిని ఏయే దేశాలకు చెందిన నౌకలు దాటాయి? అన్న వివరాల్ని పరిశీలిస్తే.. ఆసక్తికరంగా కనిపిస్తాయి. భారత్ కు చెందిన పుష్పక్.. పరిమళ్ కు చెందిన ముడిచమురు నౌకల్ని ఇరాన్ ప్రత్యేకంగా అనుమతించిన ఇరాన్.. మన దేశంతో పాటు మరిన్ని దేశాలకు చెందిన నౌకల్ని సైతం ఓకే చేసింది.

ఆ దేశాల్లో

- చైనా

- రష్యా

- పాకిస్తాన్..

- టర్కీలకు చెందిన నౌకలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ అనుమతిస్తోంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. చైనాకు చెందిన నౌకలు.. అత్యధికంగా 18-22 వరకు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటేశాయి. ఆ తర్వాతి స్థానంలో రష్యా నిలుస్తుంది. ఆ దేశానికి చెందిన 12 - 15 దేశాలకు చెందిన సోవ్ కామ్ ప్లాట్ నౌకల ద్వారా దాటేశాయి.

పాకిస్థాన్ కు చెందిన 5-7 నౌకల్ని ఇరాన్ నుంచి క్షేమంగా బయటకు వెళ్లిపోయాయి. ఇరాన్ ఇప్పటవరకు భారత్ మాత్రమే కాదు.. మరో నాలుగైదు దేశాలతోనో చక్కటి సంబంధాల్ని కొనసాగిస్తుందన్నది మర్చిపోకూడదు. అంతేకాదు.. చైనా.. రష్యా.. టర్కీ.. పాక్ దేశాలతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేని విధంగా ఆయాదేశాలకు చెందిన నౌకల్ని ఎలాంటి తనిఖీలు లేకుండా తీరాన్నిదాటుతున్నాయి.

చైనా.. రప్రముఖులకు అందేలా చూశారు. చైనా.. రష్యా..పాకిస్తాన్ లకు నియంత్రణ లేని అనుమతులు ఇవ్వటం తెలిసిందే. ప్రస్తుతం దుబాయ్ తో పాటు ఇతర ప్రాంతాల్లో మన దేశానికి చెందిన 26 ముడి చమురు నౌకలు ఇరాన్ చేసే సాయం కోసం ఎదురుచూస్తోంది. మన విషయంలో మొత్తంగా అర్థమయ్యే అంశం ఏమంటే.. ఇరాన్ కు మిత్రుడిగా ఉంటూనే.. దాని కారణంగా ఫలాలు పొందే వీలు నూటికి నూరు పాళ్లు ఉండదనే విషయాన్ని మర్చిపోకూడదు. దీనికి కారణం.. మిగిలిన మిత్రదేశాల మాదిరి కాకుండా.. భారత్ పలు సందర్భాల్లో తటస్థ వైఖరిని ప్రదర్శించటం.. మిత్రుడిగానే ఉంటూ.. అవసరానికి మించి పూసుకోకపోవటం లాంటివి చూసిపప్పుడు స్నేహితుడే.. కాసిన్ని నిబంధనలకు అనుగుణంగా స్నేహం చేసే మిత్రుడిగా భారత్ ఉంటుందని చెప్పాలి. అందుకే.. మిగిలిన వారి మాదిరి పూర్తిస్థాయిలో ప్రయోజనాలు పొందలేని పరిస్థితి.

Tags:    

Similar News