• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముగిసిన భారత్ - పాక్ ...

ముగిసిన భారత్ - పాక్ డీజీఎంవో చర్చలు.. టాపిక్స్ ఇవే!

| అవును... భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, కాల్పుల విరమణ అనంతరం నేడు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు భేటీ అయ్యారు.

By - Tupaki Desk
Update: 2025-05-12 14:01 GMT

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శనివారం మధ్యాహ్నం 3:30 కి పాక్ డీజీఎంవో.. భారత డీజీఎంవో కు ఫోన్ చేశారని.. అనంతరం ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిందనే ప్రకటన వచ్చింది.

ఆ సందర్భంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి.. ఇరు దేశాల మధ్య సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించినట్లు తెలిపారు. మే 12న డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మళ్లీ మాట్లాడతారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో చెప్పినట్లుగానే ఈ రోజు మీటింగ్ జరిగింది.

అవును... భారత్ – పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు, కాల్పుల విరమణ అనంతరం నేడు ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో)లు భేటీ అయ్యారు. ముందుగా ప్రకటించినట్లుగా మధ్యాహ్నం 12 గంటలకే చర్చలు జరగాల్సి ఉన్నా.. సాయంత్రానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించుకున్నారు.

ఈ క్రమంలో తాజాగా వారిరువురి మధ్య చర్చలు ముగిసాయి. వీరి మధ్య ప్రధానంగా.. కాల్పుల విరమణ కొనసాగింపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఉద్రిక్తతల తగ్గింపు మొదలైన అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే... ఈ చర్చల్లో ఏమి తేలిందనే విషయం మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది!

మరోవైపు ఈ రోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ దేశప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాక్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, ఇరుదేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ప్రధాని మొదటిసారిగా సోమవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Tags:    
  • IndiaPakistanWar 
  • CeasefireAgreement 
  • Operationsindoor 
  • IndiaPakistanTalks 
  • DGMO 
  • ModiSpeech 
  • KashmirBorder 

Similar News

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS