ఇంకా ఇంత బలుపా?
తాజాగా స్పందించిన అహ్మద్ షరీఫ్ చౌదురి.. కాల్పుల విరమణను తాము కోరుకోలేదని.. భారతదేశమే సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించిందని చెప్పుకొచ్చారు.;
భారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. దీనిపై భారత్ లో తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ మాటలు వింటే.. ఆ ఆగ్రహం మరింత పెరిగి అవకాశం లేకపోలేదని అంటున్నారు!
అవును... భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. పాక్ ప్రయోగిస్తున్న ప్రతీ డ్రోన్, క్షిపణి, యుద్ధ విమానాలను భారత్ సైన్యం నిర్వీర్యం చేస్తుంది. మరోపక్క పాక్ పైకి దూసుకెళ్లి.. గుల్ల గుల్ల చేస్తుంది! ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ వద్ద పాక్ రిక్వస్ట్ చేసుకుందని.. అమెరికాకు సామంత రాజుగ బ్రతుకుతామని వేడుకుందని అంటున్నారు.
మరికొంతమంది.. అణ్వాయుధాలు ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరించడమో, ఒత్తిడి చేయడమో చేశారని అంటున్నారు. లేదా.. తమకు ఐఎంఎఫ్ లోన్ ఇప్పిస్తే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని వేడుకుందని చెబుతున్నారు. దీంతో.. మోడీని ట్రంప్ సెట్ చేశారని.. రకరకాల కథానలొస్తున్నాయి. ఫలితంగా సీజ్ ఫైర్ ప్రకటన వచ్చేసింది.
దీంతో... ఈ ప్రకటనపై భారతీయులు రగిలిపోతుంటే.. పాక్ లో మాత్రం సంబరాలు అంబరాన్నంటాయి. దానికి కారణం... తమ సత్తా ఏమిటో భారత్ కు చూపించాం.. ఈ యుద్ధంలో మనం చారిత్రక విజయం సాధించాం అని పాక్ ప్రధాని ప్రకటించారు. ఈ సమయంలో పాక్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదురి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి!
తాజాగా స్పందించిన అహ్మద్ షరీఫ్ చౌదురి.. కాల్పుల విరమణను తాము కోరుకోలేదని.. భారతదేశమే సీజ్ ఫైర్ కోసం అభ్యర్థించిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... మే 6, 7 తేదీల్లో పాకిస్థాన్ పై భారతదేశం దారుణమైన, పిరికితనంతో కూడిన దాడులకు పాల్పడిందని అన్నారు.
ఆ తర్వాత సీజ్ ఫైర్ కోసం భారతదేశమే అభ్యర్థించిందని చెప్పుకొచ్చారు. అయితే.. తాము మాత్రం అందుకు కుదరదని.. ప్రతిదాడులు చేసిన తర్వాతే మాట్లాడతామని చెప్పామని.. ఈ క్రమంలో 8, 9 ప్రతి దాడులు చేసి 10న సీజ్ ఫైర్ కి అంగీకరించామని చెప్పుకొచ్చారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యకపరుస్తున్నారు.
ఇందులో భాగంగా... అహ్మద్ షరీఫ్ కి మినిమం కామన్ సెన్స్ అయినా లేనట్లుంది.. ఆయన మాటలు వినేవారంతా పాకిస్థానీయులే అనే భ్రమలో ఉన్నట్లున్నారని అంటున్నారు. ఈ స్థాయిలో గూబలు గుయ్యిమనిపించినా ఇంకా బలుపు తగ్గినట్లు లేదని ఒకరంటే... పాక్ ఆర్మీ ప్రతినిధి స్టాండప్ కామెడీ బాగుందని మరొకరు కామెంట్ స్పందిస్తున్నారు.