రిపోర్టు: అమెరికాను.. చైనాను దాటేసే భారత ఇంధన గిరాకీ
ఆ తర్వాత ఆ వాటా కాస్త తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే రెండు.. మూడు దశాబ్దాల్లో మొత్తమ్మీదా ఇంధన గిరాకీ రెండింతలు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.;
రానున్న రోజుల్లో భారతదేశ ముఖచిత్రం ఎలా ఉంటుందన్న విషయాన్ని కొన్ని రిపోర్టులు అప్పుడప్పుడు చెబుతుంటాయి. తాజాగా అలాంటి నివేదిక ఒకటి విడుదలైంది. ఇంధన గిరాకీ విషయంలో భారత్ ఎంతలా దూసుకెళుతుందో చెప్పే రిపోర్టు ఇది. షెల్ ఇండియా విడుదల చేసిన ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఏ సెక్యూరిటీ ఫోకస్డ్ ఏజ్ రిపోర్టు ప్రకారం.. భారత ఇంధనాల్లో సంప్రదాయ ఇంధన వాటా రానున్న రోజుల్లో ఎంత భారీగా పెరుగుతుందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పింది.
వచ్చే రెండు.. మూడు దశాబ్దాల్లో మొత్తంగా ఇంధన గిరాకీ రెండింతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2040 నాటికి ఇంధన గిరాకీలో అగ్రరాజ్యం అమెరికాను.. 2060 నాటికి చైనాను దాటేస్తుందని అంచనా వేసింది.ఈ రిపోర్టు నేపథ్యంలో రానున్న కాలంలో అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో భారత్ కీలకపాత్ర పోషిస్తుందన్న విషయాన్ని వెల్లడించినట్లైంది. భారత ఇంధనాల్లో సంప్రదాయ ఇంధన వాటా ఈ దశాబ్దంలో గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది.
ఆ తర్వాత ఆ వాటా కాస్త తగ్గుతుందని చెబుతున్నారు. వచ్చే రెండు.. మూడు దశాబ్దాల్లో మొత్తమ్మీదా ఇంధన గిరాకీ రెండింతలు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత దశాబ్దంలో దూసుకెళ్లిన ఆర్థిక.. జనాభా వ్రద్ధి నేపథ్యంలో భారత ఇంధన గిరాకీ 40 శాతం పెరిగిన విషయాన్ని వెల్లడించింది.
గతంలో విద్యుత్ వినియోగంలో సౌర.. పవన విద్యుత్ వాటాలు నామమాత్రంగా ఉండేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా 20 శాతానికి చేరుకోగా.. మరో పాతికేళ్లకు ఈ వాటా 59 శాతానికి మించుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే పదేళ్లలో సహజ వాయువు.. ఎల్ ఎన్ జీ కీలకపాత్ర పోషిస్తాయి. వీటి గిరాకీ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా రానున్న రోజుల్లో పెరిగే ఇంధన వినియోగానికి తగ్గట్లే.. భారత వ్రద్ధి పెరుగుతుందని చెప్పక తప్పదు.