డేటా రివల్యూషన్… ఒకప్పుడు రూ. 269, ఇప్పుడు కేవలం రూ.9..కేంద్రం క్లారిటీ

కేంద్ర ప్రభుత్వం నిరంతరం చేసిన కృషితో ఇంటర్నెట్ అనేది కేవలం ధనవంతులకే పరిమితం కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

Update: 2026-06-10 11:30 GMT

దేశంలో ఇంటర్నెట్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. అయితే, ఒకప్పుడు ఫోన్‌లో 1 జీబీ డేటా వాడాలంటేనే సామాన్యులు భయపడేవారు. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రధాని మోదీ పాలనలో దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. గతంలో వందల రూపాయలు పలికిన డేటా ధరలు, ఇప్పుడు ఊహించని విధంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయని కేంద్రం కొన్ని ఆసక్తికరమైన లెక్కలను బయటపెట్టింది. ఆ వివరాలు చూద్దాం..

ఆకాశం నుంచి పాతాళానికి డేటా ధరలు:

ఒకప్పుడు మొబైల్ రీఛార్జ్ చేయాలంటేనే జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2014 సంవత్సరంలో దేశంలో కేవలం 1 జీబీ డేటా ధర అక్షరాలా రూ. 269 గా ఉండేది. కానీ, గత 4,399 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టెలికాం రంగంలో వచ్చిన మార్పుల కారణంగా ఆ ధర అనూహ్యంగా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు అదే 1 జీబీ డేటా కేవలం రూ. 9.2 లకే లభిస్తోందని కేంద్రం వెల్లడించింది.

సామాన్యుడికి డిజిటల్ విప్లవం సొంతం:

కేంద్ర ప్రభుత్వం నిరంతరం చేసిన కృషితో ఇంటర్నెట్ అనేది కేవలం ధనవంతులకే పరిమితం కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మంది సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. చౌకైన ధరకే కాకుండా, ఎంతో నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు దేశవ్యాప్తంగా అందుతుండటం విశేషం. ఇక దీనివల్ల ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ రావడమే కాకుండా, డిజిటల్ పేమెంట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

మారిన రోజువారీ జీవితం:

డేటా ధరలు ఇంతలా తగ్గడం వల్లే ఈరోజు మనం ఇంట్లో కూర్చుని బ్యాంకింగ్ పనులు చేసుకోవడం, ఆన్‌లైన్ చదువులు, వినోదం వంటివన్నీ చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు డేటా అయిపోతుందేమోనని పొదుపుగా వాడుకున్న వాళ్లే.. ఇప్పుడు రోజుకు 1.5 జీబీ నుండి 2 జీబీ డేటాను చాలా క్యాజువల్‌గా వాడేస్తున్నారు.

ఒక దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి డిజిటల్ కనెక్టివిటీ ఎంత ముఖ్యమో భారతదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. ఒకప్పుడు రూ. 269 ఉన్న డేటాను కేవలం రూ. 9 లకే అందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఇంటర్నెట్ అందిస్తున్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ఈ డిజిటల్ విప్లవం మున్ముందు దేశాన్ని మరిన్ని సరికొత్త రికార్డుల వైపు నడిపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News