బ్రహ్మోస్ దెబ్బ, పాకిస్థాన్ అబ్బ.. ఏమి చేసి వచ్చిందంటే..?

మన సైన్యం రావల్పిండిలో గర్జించిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-05-11 19:30 GMT

మన సైన్యం రావల్పిండిలో గర్జించిందంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సైన్యం చర్యలు సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదని.. రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో కూడా బిగ్గరగా ప్రతిధ్వనించాయని అన్నారు. ఈ నేపథ్యంలో.. అందుకు కారణం బ్రహ్మోస్ అని కథనాలొస్తున్నాయి. యూపీ సీఎం వాటిని బలపరిచారు.

అవును... పాకిస్థాన్ కు అధికారికంగా రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆఫీస్ నుంచే ఆదేశాలు వెళ్తుంటాయని అంటారు. ఈ క్రమంలో.. శుక్రవారం సరిహద్దుల్లో పాక్ చేసిన పనులకు.. శనివారం తెల్లవారుజామున పాక్ లోకి ఈ కుంభస్థలానే లక్ష్యంగా చేసుకుని భారత్ విరుచుకుపడింది!

ఇక్కడే పాకిస్థాన్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ తో పాటు గగనతల రిఫ్యూలర్ ట్యాంకర్ ఫైట్లు, హెవీ లిఫ్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం తెల్లవారుజామున భారత్.. అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ వాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సియాల్ కోట్ స్థావరాలపై మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి.

ఇందులో వైమానిక స్థావరాలు, రాడార్ సైట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. ఈ క్రమంలో భారత్ వాడిన ఆయుధాల్లో... బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ఉండే అవకాశాలున్నాయని ఓ జాతీయ పత్రిక కథనంలో పేర్కొంది. ఇదే సమయంలో... యుద్ధ రంగంలో దీన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి కావొచ్చని పేర్కొంది.

ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లు, రాడార్‌ సైట్లు, ఆయుధ నిల్వ కేంద్రాలున్నాయి. భారత్‌ వాడిన వాటిల్లో హ్యామర్‌ గైడెడ్‌ బాంబులతోపాటు.. స్కాల్స్‌ క్షిపణే కాకుండా.. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్రూజ్‌ మిసైల్‌ ఉండే అవకాశాలున్నాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో పేర్కొంది. యుద్ధ రంగంలో దీనిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావొచ్చని పేర్కొంది.

అయితే.. యూపీలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని.. దాని ప్రభావం గురించి తెలియని వారు ఎవరైనా ఉంటే.. పాకిస్థాన్ ను అడిగి తెలుసుకోవచ్చని సూచించారు.

దీంతో... నిమిషాల వ్యధిలో పాకిస్థాన్ కు చెందిన కీలక స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో ఆ దేశంలో గుబులు రేగడానికి కారణం ఈ బ్రహ్మోస్ అన్నమాట అని అంటున్నారు!

Tags:    

Similar News