పాక్ కు గట్టిగానే పగిలింది.. ఉపగ్రహ చిత్రం చెప్పింది!

పైకి చెప్పుకోవడం లేదు.. భారత్ చెబితే ఒప్పుకోవడం లేదు కానీ పాకిస్థాన్ ను భారత సైన్యం గట్టిగానే కొట్టినట్లు కనిపిస్తుంది.;

Update: 2025-05-12 06:16 GMT

పైకి చెప్పుకోవడం లేదు.. భారత్ చెబితే ఒప్పుకోవడం లేదు కానీ పాకిస్థాన్ ను భారత సైన్యం గట్టిగానే కొట్టినట్లు కనిపిస్తుంది. దీనికి భారత సైన్యం మాటలో, పాక్ సైన్యం బుకాయింపులో నమ్మనివారికోసం అన్నట్లుగా తాజాగా ఉపగ్రహ చిత్రాలు తెరపైకి వచ్చాయి. నాడు - నేడు అన్నట్లుగా.. దాడులకు ముందు, దాడుల తర్వాత అక్కడ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.

అవును... మే 10న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కనీసం ఎనిమిది పాకిస్థానీ సైనిక స్థావరాలపై సమన్వయంతో ఖచ్చితమైన దాడులు నిర్వహించింది. ఈ సమయంలో తెరపైకి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు.. ఆ దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ స్థలాలు, ఆస్తుల గురించి వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు భారత్ తో పాటు చైనా నుంచి వచ్చిన ఉపగ్రహాలు వీటిని ధృవీకరిస్తున్నాయి.

భారత సైన్యం దాడుల వల్ల పాక్ భూభాగంలోని రఫికీ, చక్లాలా, మురిద్, రహీమ్ యార్ ఖాన్, చునియన్, సుక్కూర్, పస్రూర్, సియాల్ కోట్ లలోని రాడార్ ఇన్ స్టాలేషన్ లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లు, మందుగుండు సామాగ్రి డిపోలు ఉన్నాయి. ఓపెన్ సోర్స్ నిపుణుల అభిప్రాయాల ప్రకారం.. అధునాత వైమానిక క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించి ఈ దాడులు జరిగాయి.

ఈ సందర్భంగా... బెంగళూరుకు చెందిన ఉపగ్రహ నిఘా సంస్థ కావా స్పేస్... పాకిస్థాన్ లోని జకోకాబాద్, ముషఫ్, భోలారి లోని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ (పీఏఎఫ్) స్థావరాల్లో జరిగిన బాంబు నష్టానికి సంబంధించిన అంచనా చిత్రాన్ని పంచుకుంది. ఈ చిత్రాల్లో కచ్చితమైన దాడి ప్రభావాన్ని చూపిస్తుంది! భోలారి వైమానిక స్థావమ్రోలి హ్యాంగర్ ను నేరుగా ఢీకొట్టిన చిత్రాలు చూపిస్తున్నాయి.

ఇదే సమయంలో... సర్గోధ వైమానిక స్థావరం కూడా రెండు ప్రదేశాలలో ధ్వంసమైంది. ఇందులో.. రన్ వే మధ్యలో బాగా డ్యామేజ్ అయ్యింది. ఇదే సమయంలో శిథిలాలను చూపించే పిక్స్ అప్ డేట్ అయ్యాయి. అలాగే.. ఓపెన్ సోర్స్ నిపుణుడు డామీన్ సైమన్ షేర్ చేసిన చైనీస్ ఉపగ్రహ సంస్థ మిజాజ్ విజన్ నుంచి వచ్చిన ఫోటోల్లో.. పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు నిర్ధారిస్తుంది.

కాగా.. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో.. పాకిస్థాన్ వైమానిక రక్షణ రాడార్లను భారత్ ధ్వంసం చేసిన చిత్రాలను భారత సాయుధ దళాలు పంచుకున్నాయి.

Tags:    

Similar News