మైనర్ల బాలురుపై లైంగిక వేధింపులు.. ఫుట్ బాల్ కోచ్ పై పోక్సో కేసు!

చట్టాలు ఎంత బలంగా రూపుదిద్దుకుంటున్నా.. శిక్షలు ఎంత కఠినంగా ఉంటున్నా కొంతమంది ఆలోచనా విధానం, వ్యవహార శైలి మాత్రం మారడం లేదు.;

Update: 2025-05-07 04:18 GMT

చట్టాలు ఎంత బలంగా రూపుదిద్దుకుంటున్నా.. శిక్షలు ఎంత కఠినంగా ఉంటున్నా కొంతమంది ఆలోచనా విధానం, వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఇంఫాల్ తూర్పు అకాడమీలో ఫుట్ బాల్ కోచ్ (45) ను అకాడమీలోని మైనర్ ట్రైనీలపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అవును... ఇంఫాల్ లోని అకాడమీలో ఫుట్ బాల్ కోచ్ పై అకాడమీలోని మైనర్ బాలురు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు... ఫిర్యాదు చేసిన ట్రైనీలు 10 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు గల బాలురని తెలిపారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఈ సమయంలో నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఫుట్ బాల్ అకాడమీలోని ట్రైనీలపై లైంగిక వేధింపులతో పాటు ఇతర నేరాలకు కోచ్ అలవాటు పడ్డారని.. అందువల్లే కోచ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది!

ఇలా విద్యార్థుల నుంచి వెల్లడిన వివరాల ప్రకారం.. సదరు కోచ్ పై తల్లితండ్రులు హీన్ గాంగ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. దీంతో కోచ్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు పోలీసులు. ఇదే సమయంలో ట్రైనీలు ఇప్పటికే పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారని అంటున్నారు. ఇకపై ఆ కోచ్ ను అకాడమీలో ఉంచొద్దని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News