భారతీయ సంస్కృతి వైభవం.. బ్రిస్బేన్‌లో ఘనంగా ICS Convention 2026
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు మరియు కుటుంబ విలువలను ఆస్ట్రేలియాలోని తదుపరి తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ (ICS) ఆధ్వర్యంలో ICS Convention 2026 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వామి శ్రీ రాధామనోహర్ దాస్ గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ N. రామచంద్రారావు గారు, శ్రీ చామకూరి మల్లారెడ్డి గారు, శ్రీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు, శ్రీ పైడి రాకేశ్ రెడ్డి గారు, శ్రీమతి సాధినేని యామిని శర్మ గారు పాల్గొన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు మరియు కుటుంబ విలువలను ఆస్ట్రేలియాలోని తదుపరి తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఈ వేడుకలను నిర్వహించారు.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల ప్రత్యేక కార్యక్రమాలు, ఫ్యాషన్ షో మరియు ఇతర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది.
బ్రిస్బేన్‌లోని భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని ICS Convention 2026ను విజయవంతం చేశారు.