• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హైదరాబాద్ లో ఆక్రమణదారుల...

హైదరాబాద్ లో ఆక్రమణదారుల గుండెలదిరే.. ఆదివారం హైడ్రా వారం

| హైదరాబాద్ కు ఒకప్పుడు తాగు నీరందించిన జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట

By - Tupaki Desk
Update: 2024-09-22 12:21 GMT

హైదరాబాద్ కు ఒకప్పుడు తాగు నీరందించిన జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట (హిమాయత్ సాగర్) లో ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఆక్రమణల నుంచి.. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వరకు.. సికింద్రాబాద్ మణెమ్మ కుంటలో కజ్జాల నుంచి కూకట్ పల్లి నల్ల చెరువులో ఆక్రమణల దాకా.. ఆదివారం అంటే హైడ్రా వారంగా మారుతోంది. ఆక్రమణదారుల గుండెలదరగొడుతోంది. ఈ ఆదివారం కూకట్‌ పల్లి నల్లచెరువులోని ఆక్రమణల పని పట్టింది.

వినాయక చవితితో విరామం..

హైడ్రా గత నెల వరకు దూకుడు చూపింది. ఏ రోజు ఎక్కడ బుల్డోజర్ దిగుతుందో అన్న భయంలో కబ్జాదారులు ఉండేవారు. అయితే, ఇంతలో వినాయక చవితి ఉత్సవాలు రావడంతో వెనక్కుతగ్గింది. మధ్యలో సుప్రీం కోర్టులో.. బుల్డోజర్ న్యాయంపై కేసు విచారణ ఉండడంతోనూ హైడ్రా నిదానించింది. గత వారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడ్డాక స్పష్టత రావడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది.

ఉరుము లేని పిడుగులా..

హైదరాబాద్ లో ఆదివారం వస్తున్నదంటే హైడ్రా రంగంలోకి దిగుతుందని స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ చేపట్టిన ప్రధాన కూల్చివేతలన్నీ ఆదివారం నాటివే కావడం గమనార్హం. కూకట్ పల్లి నల్ల చెరువులో ఆక్రమణల విషయానికి వస్తే ఈ చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ లో ఏడు ఎకరాలు కబ్జాదారుల పరమైంది. బఫర్‌ జోన్‌ లోని 4 ఎకరాల్లో 50 పైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు కట్టారు. ఎఫ్‌ టీఎల్‌ లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. అయితే, ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది.

పొరుగు జిల్లాలోనూ..

హైదరాబాద్ ను ఆనుకుని ఉండే సంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే అమీన్‌ పూర్‌ మున్సిపాలిటీపైనా హూడ్రా నజర్ పెట్టింది. పటేల్‌ గూడ గ్రామానికి చెందిన సర్వే నం.12లోని అక్రమ నిర్మాణాలను ఆదివారం నేలమట్టం చేసింది. వాస్తవానికి దీనిపై మూడు రోజుల కిందటే నోటీసులు జారీ చేసింది. ఇక్కడ ఏకంగా 14 విల్లాలను తొలగిస్తోంది. ఇళ్లలో నివాసం ఉంటున్నవారిని ఖాళీ చేయించారు. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధి 164 సర్వే నంబరులోని మూడు అపార్ట్ మెంట్ల కూల్చివేత కొనసాగుతోంది.

Tags:    
  • Hydraa 
  • Hyderabad 
  • Telangana 
  • TGGovt 
  • Revanthreddy 
  • Cmrevanth 
  • Latestnews 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS