హైదరాబాద్ లో హైఅలెర్ట్.. అసలు నిజం ఇదీ

అయితే, కొన్నిసార్లు అతి ఉత్సాహం చూపే కొన్ని మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా గ్రూపులు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడం కోసం హై అలర్ట్‌లు, ఉగ్రవాద బెదిరింపుల గురించిన వార్తలను ప్రచారం చేస్తుంటాయి. ఇలాంటిదే హైదరాబాద్ విషయంలోనూ జరిగింది.;

Update: 2025-04-27 11:40 GMT

దేశంలో ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు భద్రతా సంస్థలు ముందుజాగ్రత్తగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయడం సహజం. అయితే, కొన్నిసార్లు అతి ఉత్సాహం చూపే కొన్ని మీడియా ఛానెళ్లు, సోషల్ మీడియా గ్రూపులు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడం కోసం హై అలర్ట్‌లు, ఉగ్రవాద బెదిరింపుల గురించిన వార్తలను ప్రచారం చేస్తుంటాయి. ఇలాంటిదే హైదరాబాద్ విషయంలోనూ జరిగింది.

కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన హెచ్చరికల దృష్ట్యా హైదరాబాద్‌ను హై అలర్ట్‌లో ఉంచినట్లు వాట్సాప్‌ సందేశాలు, సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. తెలంగాణకు 'హై అలర్ట్ జోన్'గా ప్రకటించారని, ప్రత్యేక బృందాలను నియమించారని, తెలుగు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేశారని కూడా కొన్ని తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందాయి.

అయితే, ఈ ఊహాగానాలలో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి వదంతులను నమ్మవద్దని, ఫార్వార్డ్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు. ఖచ్చితమైన సమాచారం కోసం ఎప్పుడూ అధికారిక వనరులపైనే ఆధారపడాలని హైదరాబాద్ పోలీసుల ప్రకటన పేర్కొంది.

సోషల్ మీడియాలో చార్మినార్ చిత్రాన్ని ఉంచి, హైదరాబాద్ ఉగ్రవాద బెదిరింపు కారణంగా హై అలర్ట్‌లో ఉందని పేర్కొంటూ కొన్ని పోస్టులు కనిపించాయి. ఈ సోషల్ మీడియా ప్రచారం కూడా పూర్తిగా అవాస్తవమని, దీనిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఏదైనా అలర్ట్ లేదా ముందుజాగ్రత్త చర్యలు ఉంటే, వాటిని హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అధికారికంగా తెలియజేస్తారని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని పోలీసులు తెలిపారు. ప్రజలు ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మి అనవసర భయాందోళనకు గురికావద్దని సూచించారు. అధికారిక సమాచారం కోసం హైదరాబాద్ పోలీస్ కమ్యూనికేషన్లను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News