బీజేపీ వ‌ర్సెస్ ఎంఐఎం.. స‌మ‌రం సంపూర్ణం!

బీజేపీ వ‌ర్సెస్ ఎంఐఎంల మ‌ధ్య దాదాపు 15 రోజులుగా సాగిన ఎన్నికల స‌మ‌రం ముగిసింది. హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ బుధ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌శాంతంగా జ‌రిగింది.;

Update: 2025-04-23 17:44 GMT

బీజేపీ వ‌ర్సెస్ ఎంఐఎంల మ‌ధ్య దాదాపు 15 రోజులుగా సాగిన ఎన్నికల స‌మ‌రం ముగిసింది. హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ బుధ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల వ‌ర‌కు ప్ర‌శాంతంగా జ‌రిగింది. కొంద‌రు కార్పొరేట‌ర్లు.. చాలా ఆల‌స్యంగా వ‌చ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. దీని వెనుక మంత‌నాలు జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు కూడా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.

మొత్తంగా.. 112 మంది ఓట‌ర్లు త‌మ హ‌క్కును వినియోగించుకున్నారు. వీరిలో 31 మంది ఎంపీలు, ఎమ్మె ల్యేలు.. ఇత‌ర ఎక్స్ అఫిషియో స‌భ్యులు ఉన్నారు. కాగా.. హైద‌రాబాద్ మునిసిప‌ల్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ-ఎంఐఎంలు మాత్ర‌మే పోటీ చేస్తున్నాయి. బీజేపీ త‌ర‌ఫున ఆర్ ఎస్ ఎస్ ప్రాబ‌ల్యం ఉన్న గౌతం రావు బ‌రిలో ఉన్నారు. ఇక‌, ఎంఐఎం త‌ర‌ఫున మీర్జా రియాజ్ ఉల్ హాస‌న్ బ‌రిలో నిలిచారు.

ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. రాజ‌కీయ ఫైట్ బాగానే సాగింది. వాస్త‌వానికి బీజేపీకి 22 మంది కార్పొ రేట‌ర్లు... మాత్ర‌మే ఉన్నారు. కానీ.. ఎంఐఎంకు భారీ బ‌లం ఉండ‌డంతోపాటు.. అంత‌ర్గ‌త ఒప్పందాల ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు కూడా ఎంఐఎంకు మ‌ద్ద‌తిచ్చారు. కాగా.. ఈ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి దూరంగా ఉన్న బీఆర్ ఎస్‌.. ఓటింగ్ కు కూడా దూరంగా ఉంటామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు అదే ప‌ని చేసింది.

కాగా.. సుమారు 22 సంవ‌త్స‌రాల నుంచి కూడా.. హైద‌రాబాద్ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఏక‌గ్రీవం అవుతూ వ‌చ్చింది. అయితే.. తొలిసారి మాత్ర‌మే ఓటింగ్ జ‌రిగింది. త‌మ‌కు బ‌లం లేద‌ని చెబుతూనే.. బీజేపీ రంగంలోకి దిగ‌డంతో ఈ ఎన్నిక‌లు అనివార్యంగా మారాయి. మ‌రోవైపు.. ఈ నెల 25న(శుక్ర‌వారం) ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఆ వెంట‌నే ఫ‌లితం వెలువ‌డ నుంచి ఇదిలావుంటే.. ఈ ఎన్నిక‌ల్లో ఎంఐఎం విజ‌యం ఖాయ‌మ‌ని.. పొలిటిక‌ల్ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News