డ్రగ్స్ దందాలో పట్టుబడుతున్న టెకీలు.. కారణం ఇదేనా..?

నగర (హైదరాబాద్) పరిధి విస్తృతం అవుతున్నా కొద్దీ అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.;

Update: 2025-08-04 07:48 GMT

నగర (హైదరాబాద్) పరిధి విస్తృతం అవుతున్నా కొద్దీ అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ పేరు దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోని నలు మూలల నుంచి వందలాది, వేలాది మంది ఇక్కడకు వచ్చి జీవిస్తుంటారు. ఉపాధి, జీవనోపాధికి పుట్టినిల్లు ఈ నగరం. సౌత్ లో దీనికి సాటివచ్చే నగరం లేదనేది జగమెరిగిన సత్యం. నగర పరిధి విస్తృతంగా మారుతుండడంతో డ్రగ్స్ చలామణి కూడా పెరుగుతోంది. వివిధ రకాల పార్టీల పేరుతో ప్రముఖుల నుంచి సాధారణ పౌరుల వరకు కూడా డ్ర*గ్స్ వాడుతుండడం కలతకు గురిచేస్తోంది. వీటికి కొందరు బానిసలుగా మారుతుంటే.. మరికొందరు పార్టీల వరకే పరిమితం చేస్తున్నారు.

పార్టీల పేరుతో జోరుగా డ్రగ్స్ వినియోగం..

వారం మొత్తం కష్టపడుతున్నామనే సాకుతో కొందరు టెకీలు వీకెండ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం టెకీలు చేసుకుంటున్న పార్టీలు సాధారణంగా ఉండడం లేదు. సాధారణ వైన్ తో పార్టీలు కూడా దూరమయ్యాయి. ఇప్పుడంతా డ్రగ్స్ వినియోగమే. ఈ కల్చర్ ఎంతలా పెరిగిందంటే పార్టీ అంటేనే కొకైన్, ఎల్ఎస్ డీ ఇలా నిషేధిత డ్ర*గ్స్ ఉండాల్సిందే. హైదరాబాద్ శివారులో ఈ పార్టీలు కామన్ గా మారాయి. వీటి నిర్వహణకే అన్నట్లుగా ఫాంహౌజ్ లు వెలిశాయి. ఒక్కో ఫాంహౌజ్ లో పార్టీల నిర్వహణకు ఒక్కో రేటు.. లక్షల నుంచి కోట్ల వరకు ఫాంహౌజ్ నిర్వాహకులు దండుకుంటున్నారు. వీకెండ్ పేరుతో ఫాంహౌజ్ లలో అనేక అక్రమ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు విపరీతమైన డ్ర*గ్స్ వినియోగిస్తున్నారని ముందస్తు సమాచారంతో కొందరు పట్టుబడుతున్నా.. కొన్ని కొన్ని సార్లు సాధారణ పార్టీలు, కుటుంబ పార్టీలను చూసి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆరుగురు..

ఇటీవల హైదరాబాద్ లో టెక్కీలు ఎల్ఎస్ డీ అనే నిషేధిత డ్ర*గ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల వద్ద ఉన్న ఒక ఫాంహౌజ్ లో బర్త్ డే పార్టీ శనివారం (ఆగస్ట్ 2) రాత్రి నిర్వహించారు. ఇందులో డ్ర*గ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వేగంగా దాడులు నిర్వహించిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి డ్ర*గ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. అందులో డ్ర*గ్స్ వినియోగించినట్లు (పాజిటివ్) తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఐటీ ప్రొఫెషనల్స్ కావడం గమనార్హం. వారి వద్ద నుంచి ఎల్ఎస్ డీతో పాటు భారీగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఫాంహౌజ్ యజమాని పరారీలో ఉన్నారు.

భార్యా, పిల్లలను వెంట పెట్టుకొని డ్ర*గ్స్ కొనేందుకు వచ్చి..

బర్త్ డే పార్టీ కాకుండా డ్ర*గ్స్ కొనేందుకు యత్నించిన మరో 14 మంది ఐటీ ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్ర*గ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం, సరఫరాను అడ్డుకునేందుకు ఎలైట్ యాక్షన్ ఫర్ గ్రూప్ ఫర్ డ్ర*గ్ లా ఎన్ ఫోర్స్ మెంట్ (ఈజీఎల్) ఏర్పాటైంది. ఈజీఎల్ చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ ఈ దాడులు నిర్వహించింది. అయితే డ్ర*గ్స్ కొనుగోలులో టెక్కీ జంటలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు జంటలకు చిన్నారులు వెంట ఉన్నారు. పట్టు బడిన వారిలో ఎక్కువగా 22 నుంచి 35 ఏళ్ల వయస్సు వారే కావడం గమనార్హం.

Tags:    

Similar News