• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెద్దన్న తలచుకుంటే...

పెద్దన్న తలచుకుంటే అట్టుంటది... హౌతీలకు అమెరికా బిగ్ షాక్!

| ప్రధానంగా అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ యెమెన్‌ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు

By - Tupaki Desk
Update: 2024-01-18 04:33 GMT

గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా హౌతీలు ఎర్రసముద్రం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ యెమెన్‌ తిరుగుబాటుదారులు క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఈ విషయాన్ని అగ్రదేశాలు సీరియస్ గా తీసుకున్నాయి. ప్రధానంగా హౌతీల విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఎర్ర సముద్రంలో నైకలపై హౌతీలు చేస్తున్న దాడులకు ప్రతిచర్యగా ఇటీవల యెమెన్‌ లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ లు మూడు రోజుల పాటు వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ సమయంలో హౌతీ రెబెల్స్‌ మరోసారి రెచ్చిపోయారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ లో అమెరికాకు చెందిన జెన్‌ కో పికార్డీ అనే కంటైనర్‌ నౌకపై దాడికి పాల్పడ్డారు.

ఇందులో భాగంగా ఆ నౌకపై డ్రోన్‌ తో బాంబులు జారవిడిచిన యెమెన్ తిరుగుబాటుదారులు... ఎర్రసముద్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ దాడుల్లో యూఎస్ నౌకలోని కొంత భాగం ధ్వంసమైందని బ్రిటిష్ నావికాదళానికి చెందిన యునైటెడ్ కింగ్‌ డం మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఎడెన్‌ కు ఆగ్నేయంగా 70 మైళ్ల దూరంలో ఈ దాడి జరిగిందని.. ఈ ఘటనలో స్టాఫ్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.

హౌతీలపై అంతర్జాతీయ ఉగ్ర ముద్ర:

ఇలా విరుచుకుపడుతున్న హౌతీలపై అమెరికా ఉగ్రవాద ముద్ర వేసింది. ఇందులో భాగంగా... యెమెన్‌ కేంద్రంగా పనిచేసే ఈ హౌతీ రెబల్స్‌ ను ప్రత్యేకంగా వర్గీకరించబడిన అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించింది. అయితే 3.2 కోట్ల మంది యెమెన్‌ పేద ప్రజల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఆంక్షలను విధిస్తున్నట్లు ఈ సందర్భంగా అమెరికా పేర్కొంది. వీరిపై ఆర్ధిక ఆంక్షలు విధించింది.

వాస్తవానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగిపోయే ముందే హౌతీలపై ఉగ్ర ముద్ర వేస్తూ పలు ఆంక్షలు విధించారు. అయితే... ఆ తర్వాత వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఆ ఆంక్షలను ఎత్తివేశారు. ఈ క్రమమలో తాజాగా అమెరికా నౌకలపై దాడులకు దిగుతున్న నేపథ్యంలో హౌతీ రెబల్స్‌ పై అమెరికా మళ్లీ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా... అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ముద్ర వేసి ఆంక్షలను విధించింది.

Tags:    
  • Houthis 
  • USships 
  • Redsea 
  • Airstrikes 
  • Yemen 
  • Houthisattacks 
  • Terrorism 
  • Unitedstates 
  • Joebiden 
  • Houthisrebels 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS