• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'నోట్' పెట్టి మరీ దొంగలకు...

'నోట్' పెట్టి మరీ దొంగలకు షాకిచ్చాడు

| ఇలాంటి వేళలో.. కాలనీలకు కాలనీలు ఖాళీ అయ్యే వేళ.. దొంగలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-14 08:50 GMT

సొంతూళ్లకు వెళ్లే పెద్ద పండుగ సంక్రాంతి సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానగరాలు మొదలు కొని పట్టణాల వరకు ఊరి నుంచి దూరంగా వచ్చేసేటోళ్లు.. ఏడాది మొత్తం వెళ్లకున్నా.. సంక్రాంతి పండక్కి ఊరెళ్లటం తెలిసిందే. ఈ కారణంగా హైదరాబాద్ మహానగరాలు సైతం ఖాళీ అవుతుంటాయి. రోడ్ల మీద బ్రేకులు వేయకుండా వాహనాలు నడిపేంత విశాలంగా మారుతుంటాయి. ఇలాంటి వేళలో.. కాలనీలకు కాలనీలు ఖాళీ అయ్యే వేళ.. దొంగలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం తెలిసిందే.

అందుకే.. సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసులు సైతం సూచనలు చేస్తూ.. ఊరెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని చెబుతుంటారు. అలా చేస్తే.. తాము ఒక కన్నేసి ఉంచుతామని చెబుతుంటారు. అయితే.. ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. ఒక ఇంటి యజమానికి తన ఇంటి తలుపులకు అంటించిన స్పెషల్ నోట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు ఫోటోను సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయటంతో అది కాస్తా విపరీతంగా ఫార్వర్డ్ అవుతోంది.

దొంగలను ఉద్దేశించి సదరు ఇంటి యజమాని.. ‘మేము సంక్రాంతికి ఊరికి వెళ్లిపోతున్నాము. ‘‘డబ్బు.. నగలు’’ తీసుకొని పోతున్నాము. మా ఇంటికి రాకండి - ఇట్లు మీ శ్రేయోభిలాషి’ అంటూ ఒక పేపర్ మీద పెద్ద అక్షరాలతో రాసేసి.. దాన్ని తగిలించి వెళ్లిపోయాడు. దీన్ని ఫోటో తీసిన ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. ఇది కాస్తా ఆసక్తికరంగా మారింది. దొంగలకు పని తగ్గించేందుకు అన్నట్లుగా సూచన చేసిన సదరు యజమాని ఆలోచన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా ఊరికి వెళ్లిన ఇంటి యజమానులకు దొంగలు షాకిస్తుంటారు.తాజా ఉదంతంలో మాత్రం దొంగలకే ముందస్తుగా షాకిచ్చిన వైనం అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకునేలా చేసింది. ఈయన ఎవరో కానీ దొంగలకే లేఖ రాశారంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఈ నోట్ పెట్టిన పెద్ద మనిషి ఏ ప్రాంతానికి చెందిన వాడన్నది మాత్రం బయటకు రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని సదరు ఇంటి యజమానికి వివరాలు త్వరలో బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Tags:    
  • Sankranti2025 
  • Sankrantifestival 
  • Sankranticelebrations 
  • Hyderabad 
  • Hyderabadpeople 
  • Colonies 
  • Vacations 
  • Holidaytrip 
  • Owner 
  • Viralpic 
  • Socialmedia 
  • Thiefes 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS