ఏఐసీసీ నుంచి పిలుపు... కాంగ్రెస్ కు షర్మిళ ట్విస్ట్ ఇచ్చారా?
అవును... గత కొన్ని నెలలుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటంపై విపరీతంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.;
గతకొన్ని రోజులుగా షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని.. ఆమెకు ఏఐసీసీ ఏపీ చీఫ్ బాధ్యతలు ఇవ్వబోతున్నారని.. రకరకాల ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ రాజకీయాల్లో బలమైన చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో షర్మిలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీ అధిష్టాణానికి ట్విస్ట్ ఇచ్చారని అంటున్నారు. దీంతో షర్మిళ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అవును... గత కొన్ని నెలలుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటంపై విపరీతంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల సమయంలోనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటంతో పాటు.. పాలేరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారని రకరకాల కథనాలొచ్చాయి. ఇదే సమయంలో ఆమె కాంగ్రెస్ లో చేరడాన్ని పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారనీ కథనాలొచ్చాయి. దీంతో.. ఆమె బయట నుంచి కాంగ్రెస్ కు మద్దతు పలికారు.
అయితే ఈసారి షర్మిళ.. కాంగ్రెస్ పార్టీకి ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. రేపు (డిసెంబర్ 28) కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావటంతో షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారని తెలుస్తుంది! ఈ సమయంలో షర్మిలకు ఏపీ బాధ్యతలు ఇస్తారనే చర్చ సాగుతున్న వేళ.. సరికొత్త అంశం తెర మీదకు వచ్చింది.
ఇందులో భాగంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిళ సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాను తప్ప... ఏపీ బాధ్యతలు తీసుకునే అంశం గురించిన చర్చ ప్రస్తుతానికి వద్దని షర్మిళ ప్రతిపాదించినట్ల తెలుస్తోంది. ముందుగా... జాతీయ స్థాయిలో ఏఐసీసీలోనే సర్ధుబాటు చేయాలని ఆమె ఈ మేరకు విజ్ణప్తి చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతానికి తన పార్టీ (వైఎస్సార్టీపీ) ని వీలినం చేసే విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అనంతరం వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆమెకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని అంటున్నారు. దీంతో తాజాగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిళకు అనే అంశం జస్ట్ రూమర్ మాత్రమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!