తీవ్ర హింసాత్మకంగా మారిన వివాహం... వధువు వెయిటింగ్ అక్కడ!

డైరెక్ట్ గా మేటర్ లోకి వెళ్లిపోతే హరిద్వార్ లో జరిగిన ఓ దిగ్భ్రంతికర సంఘటనలో వధూవరుల కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగడంతో..;

Update: 2025-04-25 05:51 GMT

డైరెక్ట్ గా మేటర్ లోకి వెళ్లిపోతే హరిద్వార్ లో జరిగిన ఓ దిగ్భ్రంతికర సంఘటనలో వధూవరుల కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగడంతో.. ఎంతో సంతోషంగా, సంబరంగా జరగాల్సిన వివాహం కాస్తా గందరగోళంగా మారింది. ఈ ఘటనలో సుమారు 20 మంది గాయపడ్డారు.. వివాహం కూడా రద్దైపోయింది.. వధువు వేదికపై ఎదురుచూస్తుంది!

అవును... హరిద్వార్ లోని బహద్రాబాద్ లో సోమవారం రాత్రి హోటల్ లో ఓ వివాహం జరగనుంది. ఈ సమయంలో మొరాదాబాద్ నుంచి వరుడి వివాహ ఊరేగింపు స్థానిక హోటల్ కు చేరుకుంది. తర్వాత సాంప్రదయ రిబ్బన్ కట్ వేడుక జరుగుతుండగా.. మరోపక్క రెండు కుటుంబాల మధ్య మాటల వాగ్వాదం ప్రారంభమైంది. దీనికి అక్కడున్నవారి నోటి దురతే కారణం అని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఇరు కుటుంబాల మధ్య తొలుత వాగ్వాదం మొదలైన సమయంలో.. వరుడి తరుపు సభ్యులు కొందరు వధువు తరుపు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. దీంతో పరిస్థితి మరింత దిగజారిందని చెబుతున్నారు. దీంతో... వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి భౌతిక దాడులు, రాళ్లు విసురుకోవడాల వరకూ వెళ్లిందని తెలుస్తోంది.

ఈ సమయంలో రెండు వైపుల నుంచి సుమారు 20 మందికి పైగా అతిథులు గాయపడ్డారని అంటున్నారు. ఇందులో భాగంగా... వరుడి వైపు నుంచి 8 నుంచి 10 మంది.. వధువు వైపున వారు కనీసం 10 నుంచి 12 మంది గాయపడ్డరని.. వారికి వైద్య సహాయం అవసరమని నివేదికలు చెబుతున్నాయి. అయితే... ఈ వ్యవహారం తెలియక వధువు వేదికపైనే ఎదురుచూసిందని చెబుతున్నారు.

ఈ ఘర్షణలో వివాహ కార్యక్రమానికి వేదికగా నిలిచిన హోటల్ కూడా గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. దీంతో... సమాచారం అందుకున్న పోలీసుల్లు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్నవారు చెల్లచెదురైపోయారు. ఈ సందర్భంగా స్పందించిన వధువు సోదరుడు.. వివాహం జరగలేదని తెలిపారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News