హార్దిక్ పాండ్యా-నటాషా జంట బ్రేక‌ప్?

హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ విడాకుల దిశ‌గా వెలుతున్నారా? అంటే అవున‌ని సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది.

Update: 2024-05-23 13:30 GMT

హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ విడాకుల దిశ‌గా వెలుతున్నారా? అంటే అవున‌ని సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం సాగుతోంది. రెడ్డిట్ లో ఇది కేవ‌లం ఒక ఊహాజ‌నిత క‌థ‌నంగా దీనిని భావిస్తే .. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో హార్దిక్ పాండ్యా టీమ్ వైఫ‌ల్యాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి నాకౌట్ అయిన మొదటి జట్టుగా అవతరించింది. ఇప్పుడు హార్దిక్ త‌న భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోతున్న‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది విచారిస్తే.. ఒక రెడ్డిట్ పోస్ట్ లో `నటాషా - హార్దిక్ విడిపోయారా?` అనే టైటిల్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. నటాషా- హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరి స్టోరీస్ ని ఒకరు షేర్ చేసుకోవ‌డం లేదని.. `నటాసా స్టాంకోవిక్ పాండ్యా` అనే పేరుతో ఉండే దానిని `నటాసా స్టాంకోవిక్`గా మార్చిందని ఒక నెటిజ‌న్ పోస్ట్ చేసారు.

ఒక రెడ్డిటర్ మంగళవారం నాడు ఇలా పోస్ట్ చేశాడు. ``ఇది కేవలం ఊహాగానం మాత్ర‌మే... అయితే వారిద్దరూ ఒకరికొకరు ఇన్‌స్టా స్టోరీస్ ని పోస్ట్ చేయడం లేదు.. ఇంతకుముందు నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ``నటాసా స్టాంకోవిక్ పాండ్యా``లో పాండ్యాను కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె అతడి పేరును పూర్తిగా తొలగించింది... అని రాసారు. ఇదే పోస్ట్‌లో ఇంకా ఇలా ఉంది. ఆమె పుట్టినరోజు మార్చి 4.. ఆ రోజు హార్దిక్ నుండి ఎటువంటి పోస్ట్ లేదు.. అగస్త్య వారితో ఉన్న పోస్ట్‌ను మినహాయించి ఆమె , హార్దిక్ కూడా ఇటీవలి అన్ని పోస్ట్‌లను కూడా తొలగించారు. అలాగే ఆమె కనిపించడం లేదు. కృణాల్ - పంఖురి ఇప్పటికీ ఆమె పోస్ట్‌లపై వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, ఈ ఐపిఎల్ లేదా జట్టుకు సంబంధించిన కథనాలను పోస్ట్ చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జ‌రుగుతోంది అని రెడ్డిట‌ర్ అనుమానం వ్య‌క్తం చేసాడు. ఇప్ప‌టికి ఇవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే. నెటిజ‌నుల ఊహాజ‌నిత క‌థ‌నాలుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలి. ఇందులో నిజానిజాలేమిట‌న్న‌ది హార్థిక్ స్పందిస్తే కానీ క్లారిటీ రాదు.

మరికొద్ది రోజుల్లో హార్దిక్ USA లో అలాగే వెస్టిండీస్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్‌లో పాల్గొననున్నాడు. అతడు భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ .. రానున్న టోర్నీల్లో టీమ్ అదృష్టానికి కీలకం కాబోతున్నాడు.

Tags:    

Similar News