వీడియో: ఎంఐ టీమ్ బస్సులో 'జాస్మిన్' ఎందుకు హార్దిక్ పాండ్యా?

ఇప్పుడు తాజాగా ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు బస్సులో ఎక్కడంతో హార్ధిక్ తో డేటింగ్ పుకార్లు మరోసారి షికారు చేస్తున్నాయి.;

Update: 2025-04-01 13:20 GMT

గత కొంతకాలంగా టీమిండియా ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీమ్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా గర్ల్ ఫ్రెండ్ అని ప్రచారం జరుగుతున్న జాస్మిన్ వాలియా తాజాగా.. ముంబై ఇండియన్స్ – కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సందడి చేశారు. దీంతో... హార్దిక్ తో జాస్మిన్ డేటింగ్ వార్తలకు మరోసారి బలం చేకూరినట్లయ్యింది!

అవును... ప్రముఖ బ్రిటీష్ - ఇండియా గాయని జాస్మిన్ వాలియా సోమవార్రం రాత్రి ముంబైలో కేకేఆర్ తో ఎంఐ కి జరిగిన మ్యాచ్ లో సందడి చేశారు. ఈ సమయంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంఐ టీమ్ ని ఫుల్ గా ప్రోత్సహించిన ఆమె.. మ్యాచ్ అనంతరం టీమ్ మెంబర్స్ తో పాటు బస్సు ఎక్కుతూ కనిపించడం వైరల్ గా మారింది.

వాస్తవానికి జాస్మిన్ వాలియా మ్యాచ్ సమయంలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల దుబాయ్ లో పాక్-భారత్ మధ్య జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సమయంలోనూ ఆమె కనిపించి సందడి చేశారు. ఇప్పుడు తాజాగా ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టు బస్సులో ఎక్కడంతో హార్ధిక్ తో డేటింగ్ పుకార్లు మరోసారి షికారు చేస్తున్నాయి.

కాగా... గత ఏడాది జూలై 20న తాము విడిపోతున్నట్లు హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము 4 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు నాడు ఇరువురూ ప్రకటించారు.

మరోపక్క వరుసగా రెండు ఓటముల తర్వాత ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు బోణీ కొట్టింది. కోల్ కతా నైట్ రైండర్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇందులో భాగంగా.. తొలుత కేకేఆర్ ను 116 పరుగులకే కట్టిన చేసిన ముంబై.. 12.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.

Tags:    

Similar News