అమెరికానే కాదు బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయ్ బాస్
ఒళ్లు వంచి పని చేయాలే కానీ.. పని చేయించుకోవటానికి ఈ ప్రపంచంలో బోలెడంత మంది సిద్ధంగా ఉన్నారు.;
ఒళ్లు వంచి పని చేయాలే కానీ.. పని చేయించుకోవటానికి ఈ ప్రపంచంలో బోలెడంత మంది సిద్ధంగా ఉన్నారు. వృత్తి నిపుణుల కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోని చాలా దేశాలకు చెందిన ప్రజలు పనితో పాటు.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. భారతీయులు.. చైనీయులు లాంటి కొన్ని దేశాలకు చెందిన వారే పని కోసం ఫ్యామిలీలను పక్కన పెట్టేసి కష్టపడుతుంటారు. ఇలాంటోళ్ల కోసం గాలించే కంపెనీలకు కొదవ లేదు. ట్రంప్ పుణ్యమా అని విపరీత నిర్ణయాల్ని వరుస పెట్టి తీసుకుంటున్న వేళ.. డాలర్ డ్రీమ్స్ కు గండి పడొచ్చేమో కానీ.. విదేశాల్లో ఉపాధి అవకాశాలకు కొదవ లేదు.
అమెరికా అయితే బాగుంటుందన్న మైండ్ సెట్ ఒక్కటి తప్పించి.. ముప్ఫై ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లేందుకు మనోళ్లు ఆలోచించేటోళ్లు. అదే పనిగా పెద్ద ఎత్తున వెళ్లి.. మనకు అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేసుకున్న తర్వాత.. అమెరికాకు అమలాపురానికి పెద్ద తేడా లేకుండా పోయిన పరిస్థితి. తాజాగా హెచ్1బీ వీసాల రుసుమును ఏకంగా లక్ష డాలర్ల (మన రూపాయిల్లో రూ.84 లక్షలు) కు పెంచేస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. డాలర్ ఆశలు నీరు కారినట్లే. అలా అని మరీ అంతలా కుంగిపోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే.. గడిచిన నాలుగేల్లుగా అమెరికాలో జాబ్ మార్కెట్ సరిగా లేదన్న విషయాన్నిమర్చిపోకూడదు. మాంద్యం కారణంగా ఉద్యోగాలు సరిగా లభించని పరిస్థితి. మార్కెట్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ.. ఉన్న ఉద్యోగాలే ఊడుతున్న వేళ.. ఉన్నత విద్య కోసం వెళ్లినోళ్లు.. ఉపాధి అవకాశాలు దొరక్క కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఇలాంటి వేళలోనే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రత్యామ్నాయ అవకాశాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఐరోపా.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. జపాన్ లాంటి ప్రాంతాల్లో ఐటీ ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉండటమే కాదు.. నిపుణుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మన ముఖాన తలుపులు మూసే ట్రంప్ ను లైట్ తీసుకొని.. మనల్ని నెత్తిన పెట్టుకునే దేశాల వైపు ఫోకస్ పెడితే సరి. ఈ దేశాల్లో సాఫ్ట వేర్ రంగంపై బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తున్నారు. కాబట్టి.. ఎంతసేపటికి అమెరికా.. డాలర్ డ్రీమ్స్ ను పక్కన పెట్టేసి.. మెరుగైన ఉపాధి అవకాశాల్ని అందించే ఏ దేశానికైనా వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే సరి.
ఒక దారి మూసుకుపోతే మరో దారి అన్న చందంగా.. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ మంచి పనే చేశాడని భావించాలి. ఈ రోజున అమెరికా కాకుంటే మరే దేశానికి వెళ్లాలన్న ఆలోచనే కష్టంగా ఉంది. ఇప్పుడు కొత్త దారుల్ని వెతుక్కొని.. ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకుంటే యూఎస్ మీద విపరీతంగా ఆధారపడే అవకాశమే ఉండదు. ఇవాళ కాకున్నా.. రేపొద్దున అయినా బారతీయ నిపుణుల అవసరం తప్పదు ఈ రోజున డబ్బుల బూచి చూసించి ముఖాన తలుపులు వేసిన అమెరికానే.. కొద్ది కాలం తర్వాత అయినా పచ్చ తివాచీ పరిచి మరీ.. వెల్ కం చెప్పే రోజు ఖాయంగా వస్తుంది. అప్పటివరకు వెయిట్ చేయకుండా.. ప్రత్యామ్నాయాల మీద ఫోకస్ చస్తే సరి. ఏమంటారు?