• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గురుమూర్తి కాదు క్రూర...

గురుమూర్తి కాదు క్రూర మూర్తి !

| ఎందుకంటే హద్దులు ఎల్లలు లేని దేశమంతా తనవారు అనుకునే పవిత్రమైన సైనికుడిగా ఉన్న గురుమూర్తి ఇంత సంకుచితంగా ఉంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

By - Tupaki Desk
Update: 2025-01-28 16:17 GMT

మనిషిగా చెప్పుకోవడానికే సాటి వారు సిగ్గుపడే పని చేశాడు గురుమూర్తి అనబడే ఒక క్రూర మూర్తి. ఈయన మాజీ జవాన్. సైన్యంలో పూర్తి స్థాయి జవాన్ గా పనిచేసి దేశం కోసం పోరాడిన ధీరోదాత్తుడు. హృదయం కూడా అంతటి విశాలంగా ఉంటుందని అంతా భావిస్తారు. ఎందుకంటే హద్దులు ఎల్లలు లేని దేశమంతా తనవారు అనుకునే పవిత్రమైన సైనికుడిగా ఉన్న గురుమూర్తి ఇంత సంకుచితంగా ఉంటాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్య మాధవిని అత్యంత పైశాచికంగా హత్య చేసి తెలుగు రాష్ట్రాల్లో దారుణాతిదారుణమైన హత్యలలో వేళ్ళ మీద లెక్కబెట్టే వాటిలో ఒకటిగా అగ్ర స్థానంలోకి గురుమూర్తి కేసు నిలిచిపోయేలా చేశాడు.

ఈ మొత్తం కేసుని అత్యంత చాకచక్యంగా చేదించిన పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. శభాష్ అనిపించుకున్నారు కూడా. ఇంతకీ ఈ గురుమూర్తి చేసిన క్రూరత్వం చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి తన కుటుంబంతో హైదరాబాద్ లో జీవిస్తున్నాడు. సైన్యంలో పదవీ విరమణ తరువాత హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. భార్య ఇద్దరు పిల్లలు ముచ్చటైన కుటుంబంగా ఉన్నారు.

ఇక చూస్తే అందరిలాగానే కుటుంబంతో సహా సంక్రాంతి పండుగకు ఊరెళ్ళిన గురుమూర్తి ఈ నెల 15న అక్కడ నుంచి హైదరాబాద్ కి తిరిగి భార్యతో వచ్చాడని పోలీసులు తెలిపారు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పిల్లలను సొంత ఊరులో వదిలేసి భార్యను తీసుకుని వచ్చిన గురుమూర్తి ఈ నెల 15న ఆమెకు దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ముందుగా భార్య తలను గోడకేసి కొట్టి ఆ తరువాత ఆమె మీద కూర్చుని గొంతుని కసిగా నులిమేశాడు. ఆ తరువాత అతని రాక్ష పర్వం ఎలా సాగిందంటే ఇంట్లో ఉన్న కత్తితో మృత జీవిగా ఉన్న భార్య కాళ్ళు చేతులూ కూరగాయలు తగినంత సులువుగా తల కట్ చేసి పారేశాడు.

అలా వేరు చేసిన శరీర భాగాలను హీటర్ పెట్టి ఆ నీళ్ళలో ఉడికించాడు. మళ్ళీ వాటిని తీసుకుని స్టవ్ మీద కాల్చేశాడు. అలా బాగా కాల్చిన వాటిని మళ్ళీ ముక్కలు చేశాడు. ఎముకలను మాంసం ముద్దలను వేరు చేసి మరీ మళ్ళీ కాల్చాడు.

ఎముకలను అయితే పిండి కొట్టినట్లుగా బాగా దంచి కొట్టి పౌడర్ గా చేశాడు అంటే వామ్మో ఇంతటి క్రూరత్వమా అనిపించేలా ఉందని అంటున్నారు. అలా నిలువెత్తు మనిషిని అర్ధాంగిని వీలైనన్ని ముక్కలుగా ముద్దగా పౌడర్ గా చేసిన తరువాత గురుమూర్తి పెయింట్ బకెట్ లో ఆ బూడిదను ముక్కలను పౌడర్ ని తీసుకుని మీర్ పేట చెరువులో కలిపేసి ఏ ఒక్క ఆనవాలూ మిగలకుండా చేశాడు.

ఇలా ఉదయం పది గంటలకు హత్య చేసి సాయంత్రం ఆరు గంటలకు చెరువులో కలిపేయడంతో గురుమూర్తి హత్యలో పీహెచ్ డీ ఎలా చేశాడో పోలీసులు కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. ఇంత చేశాక పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చి ఏమీ ఎరగనట్లుగా ప్రవర్తించడం అతనికే చెల్లింది అంటున్నారు. ఇక అనుమానం వచ్చిన మాధవి తల్లిదండ్రులు తమ బిడ్డ ఏదీ అని అడిగితే వారితోనే కలసి మిస్సింగ్ కేసు పెట్టాడు.

అయితే పోలీసులకు మొదట అనుమానం వచ్చింది గురుమూర్తి మీదనే. కానీ ఏ ఒక్క సాక్ష్యం లేకుండా చేసిన గురుమూర్తి ఏ విధంగానూ ఆందోళన చెందలేదని పోలీసులు చెప్పారు. అయితే ఇన్ని చేసిన అతను బూడిదను ఎముకల పౌడర్ని కలిపేయడానికి తీసుకెళ్ళిన ప్లాస్టిక్ బకెట్ ఆధారాన్ని మాత్రం ఉంచేశాడు. సరిగ్గా అదే పోలీసులకు అతన్ని పట్టించింది.

దాంతో అరెస్ట్ చేశారు. ఆ బకెట్ ఆధారంతో చెరుగులో కొన్ని శరీర భాగాలను కూడా గుర్తించామని పోలీసులు చెప్పారు. ఇదిలా ఉంటే ఇంతలా దారుణాన్ని చేసినా గురుమూర్తిలో ఏ కోశానా బాధ కానీ పశ్చాత్తాపం కాని కనిపించలేదని పోలీసులు చెబుతున్నారంటే వామ్మో మనుషుల ముసుగులో మృగాలు తిరుగుతున్నాయా అనిపించేలా ఈ కేసు ఉందని అంటున్నారు.

ఈ మొత్తం కేసులో ఎందుకు భార్యను చంపాడు గురుమూర్తి అన్నదే వెల్లడి కావడం లేదు అంటున్నారు పోలీసులు . గురుమూర్తిని వివాహేతర సంబంధాలు కూడా లేవుట. మరి భార్యాభర్తల మధ్య అయితే గొడవలు ఉన్నాయని గతంలో అనేక సార్లు పెద్దలు పంచాయతీలు పెట్టి సర్దిచెప్పారని పోలీసులు చెబుతున్నారు.

అత్యంత భయంకరంగా పాశవికంగా హత్య చేసిన గురుమూర్తి ఈ కేసు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలో దారుణానికి పర్యాయపదం చెప్పాడు. ఒక విధంగా ఇలాంటి కేసులు చూసినపుడు మనిషిగా పుట్టిన ప్రతీ వాడు సిగ్గుపడాల్సిందే. అతనికి ఏ శిక్ష పడుతుందో తెలియదు కానీ ఏమి విధించినా అవన్నీ చిన్నవే అన్నది సమాజం మొత్తం అంటున్న మాట.

Tags:    
  • GuruMurthy 
  • Wifemurder 
  • Wifemurdercase 
  • Brutalkilling 
  • Exsoldier 
  • Exsoldiergurumurthy 
  • Andhrapradesh 
  • Telangana 
  • Policeinvestigation 
  • Crimedetails 
  • Horrificmurder 
  • Familydispute 
  • Humancruelty 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS