వర్షం చెప్పిన అసలు కథ: రోడ్డెక్కిన కండో*మ్‌లు.. ప్రజల్లో కలకలం!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారగా, గుంటూరులో మాత్రం వర్షం ఒక వింత దృశ్యాన్ని బయటపెట్టింది.
- అరండల్‌పేట రహదారులపై విచిత్ర దృశ్యం
గుంటూరు నగరంలోని ఎప్పుడూ రద్దీగా ఉండే అరండల్‌పేట రోడ్డుపై వర్షపు నీటితో పాటు అనుకోకుండా పెద్ద సంఖ్యలో కండో*మ్‌లు కొట్టుకువచ్చి పడటంతో స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రహదారులపై వాటిని చూసిన ప్రజలు తీవ్ర అసహనానికి గురై చీదరించారు. వినాయక చవితి సందర్భంగా మండపాలకు వచ్చే భక్తులు కూడా ఆ దృశ్యాన్ని చూసి విస్మయం వ్యక్తం చేశారు.
- లాడ్జి నుంచి బయటకు వచ్చినవేనా?
ఆ కండో*మ్‌లు ఒక లాడ్జి ముందు రోడ్డు మీద కనిపించడంతో ఆ లాడ్జిలో అసలు ఏం జరుగుతుంది అన్న అనుమానాలు ప్రజల్లో మొదలయ్యాయి. వర్షం నీటితో అవి బయటకు కొట్టుకువచ్చి రహదారిపైకి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనితో ఆ లాడ్జి కార్యకలాపాలపై అనుమానాలు ముదురుతున్నాయి.
- ప్రజల ప్రశ్నలు – పోలీసుల మౌనం
నగర నడిబొడ్డులో ఇలాంటి దృశ్యం కనబడుతుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై కండో*మ్‌లు కొట్టుకువచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
- వర్షం చెప్పిన కథ
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులు మునిగిపోయాయి. కానీ ఈ వర్షం గుంటూరులోని ఒక లాడ్జి రహస్యాలను కూడా అందరికీ బహిర్గతం చేసింది. ఇకనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఆ లాడ్జిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.