• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గుడివాడ వైసీపీ ఆఫీసుకు...

గుడివాడ వైసీపీ ఆఫీసుకు టీడీపీ ఫ్లెక్సీ.. కారణమిదే

| గుడివాడ అన్నంతనే గుర్తుకు వచ్చే వైసీపీ నేత కొడాలి నాని అలియాస్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు కు ఊహించని షాక్ తగిలింది.

By - Tupaki Desk
Update: 2024-06-22 04:03 GMT

గుడివాడ అన్నంతనే గుర్తుకు వచ్చే వైసీపీ నేత కొడాలి నాని అలియాస్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు కు ఊహించని షాక్ తగిలింది. నిత్యం తన రాజకీయ ప్రత్యర్థుల్ని బండ బూతులు తిట్టటం.. ప్రతి మాట ముందు ఒక బూతు.. చివర ఒక బూతుతో పాటు.. స్థాయిలను మరిచి మాట్లాడే అతగాడికి చెందిన వైసీపీ కార్యాలయానికి తాజాగా టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు కావటం సంచలనంగా మారింది.

గుడివాడ బస్టాండ్ కూడలిలో శరత్ థియేటర్ ప్రధాన ద్వారంపై టీడీపీకి చెందిన ఒక భారీ ఫ్లెక్సీ వెలిసింది. ఈ థియేటర్ లో వాటాలున్న యజమానుల్లో ఒకరైన టీడీపీ నేత.. గుడివాడ మున్సిపల్ మాజీ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు యువసేన పేరుతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం.. కానున్నది ఆంధ్రరాష్ట్రం స్వర్ణయుగమంటూ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో పాటు వంగవీటి మోహన్ రంగా ఫోటోను సైతం ప్రముఖంగా ముద్రించటం మరో ట్విస్టుగా చెప్పాలి. గడివాడలోని శరత్ థియేటర్ లో ఎనిమిదేళ్ల క్రితం కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ థియేటర్ లో సహ భాగస్వామ్యులైన వారు కొడాలి నానిని పార్టీ ఆఫీసును ఖాళీ చేయాలని కోరినా ఆయన పట్టించుకోలేదు.

2019 ఎన్నికల ఫలితాలు వెల్లడై.. కొడాలి నాని విజయం సాధించిన రోజే టీడీపీ నేత యలవర్తి కారును.. గుడివాడలోని ఆయన హోటల్ పైనా.. ఇంటిపైనా కొడాలి నాని అనుచరులు దాడులు చేపట్టారు. చేతిలో అధికారం ఉండటంతో శరత్ థియేటర్ లో తన ఆఫీసును కంటిన్యూ చేశారు. తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం సాధించటంతో కొడాలి హవాకు బ్రేకులు పడ్డాయని చెబుతున్నారు. అసెంబ్లీలో ప్రమాణస్వీకారాల రోజునే గుడివాడ శరత్ థియేటర్ ఎంట్రీలో భారీ టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు కావటం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    
  • Gudivada 
  • Ysrcp 
  • Kodalinani 
  • Tdp 
  • Venigandlaramu 
  • Chandrababunaidu 
  • Jaganmohanreddy 
  • Janasena 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

Copyright @2026

Powered by Blink CMS