దొంగలు అనుకొని చితకబాదారు.. గూగుల్ కంపెనీకి తెలిసి ఏం చేశారంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘటన సమాజంలో అవగాహన లోపం ఎంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా చూపించింది.;
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘటన సమాజంలో అవగాహన లోపం ఎంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో స్పష్టంగా చూపించింది. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా చాలా చోట్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సర్వేలని, లేదా అధికారులమంటూ కొందరు వ్యక్తులు అక్కడక్కడ హల్ చల్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘనలు ఎన్నో బయటపడుతన్నాయి. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకుంది. కానీ అసలు విషయం తెలిసి గ్రామస్తులు నాలుక కరుచుకున్నారు. సర్వే నిమిత్తం గ్రామానికి వచ్చిన గూగుల్ మ్యాప్స్ బృందాన్ని స్థానికులు దొంగలుగా పొరబడి తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది.
అపార్థానికి కారణమేంటి?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో గూగుల్ టీమ్ ప్రత్యేక వాహనంలో గ్రామానికి చేరుకొని డేటా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. గ్రామస్తులు ఆ బృందాన్ని అనుమానించారు. తాజాగా గ్రామాల్లో దొంగతనాలు, మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితులపై మరింత అనుమానం పెంచుకున్నారు. ఆ అనుమానం కోపంతో మిళితమై దాడికి పాల్పడేలా చేసింది.
పోలీసుల ఎంట్రీ.. గ్రామస్తులు షాక్...
ఘటనలో పలువురు సిబ్బంది గాయపడగా, పోలీసులు వెంటనే చేరుకొని వారికి వాస్తవ పరిస్థితిని వివరించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అధికారిక బృందమేనని తెలిసిన తరువాత గ్రామస్తుల్లో ఉద్రిక్తత చల్లారింది. ఏ కొంచెం ఆలస్యమైనా పరిస్థితి దారుణంగా మారేది.
అసలు సమస్య ఎక్కడ?
ఈ ఘటనలో రెండు ప్రధాన అంశాలు బయటపడ్డాయి. ప్రజల్లో అవగాహన లోపం స్పష్టమైంది. ప్రభుత్వ లేదా ప్రైవేట్ సర్వే బృందాలు గ్రామాలకు వెళ్తే ముందుగా సమాచారం ఇవ్వకపోవడం మరో తప్పిదంగా భావించవచ్చు. భద్రతా భయాలు. గ్రామాల్లో చోరీలు పెరగడం వల్ల ప్రజలు అపరిచితులను నమ్మే స్థితిలో లేరు.
పరిష్కార మార్గాలు ఏమిటి?
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలి. సర్వే బృందాల వివరాలు, పనితీరును ముందుగానే ప్రజలకు తెలియజేయాలి. అలాగే గ్రామస్తుల్లో న్యాయబద్ధమైన అవగాహన పెంపొందించడానికి ప్రచారం చేయడం అత్యవసరం.
ఈ సంఘటన ఒక చిన్న అపార్థమే అయినా, దాని ద్వారా ప్రజల అవగాహన అవసరం, సమాచార లోపం వల్ల కలిగే ప్రమాదం, అధికారుల బాధ్యత అనే మూడు ప్రధాన పాఠాలు మనకు స్పష్టమవుతున్నాయి.