• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీజేపీకి షాకిచ్చిన నటి...

బీజేపీకి షాకిచ్చిన నటి సరికొత్త ప్రయాణం ఇటు నుంచే..!

| అవును... బీజేపీకి రాజీనామా చేసినప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే కనిపించిన నటి గౌతమి తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-15 05:49 GMT

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఒకప్పుడు స్టార్ హీరోయిన్, సీనియర్ నటి గౌతమి... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ తో కొంతకాలం రిలేషన్ లో ఉన్న ఆమె... సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంటారు. ఈ క్రమంలో సుమారు 25 ఏళ్లుగా ఆమె బీజేపీలో ఉన్నారు.

ఈ క్రమంలో ఎల్.కే. అద్వానీ రథయాత్ర సమయంలో కూడా ఆమె చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్నారు. అయితే గత ఏడాదిలో ఆమె బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు! ఇందులో భాగంగా... డబ్బు, ఆస్తి విషయంలో తనను భారీగా మోసం చేసిన ఓ వ్యక్తికి భారతీయ జనతాపార్టీలోని కొందరు సీనియర్లు సపోర్టుగా నిలిచారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏమాత్రం సరైన చర్య కాదంటూ ఆమె ఫైరయ్యారు.

ఈ క్రమంలో సుమారు రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని ఆమె గత ఏడాది అక్టోబర్ లో తెంచుకున్నారు.. ఈ మేరకు ఆ నెల 23న రాజీనామా లేఖ రాశారు. తనకు వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పుడు పార్టీ నుంచి ఎటువంటి మద్దతూ లేకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అనంతరం కొన్ని మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న గౌతమి... తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

అవును... బీజేపీకి రాజీనామా చేసినప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే కనిపించిన నటి గౌతమి తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తాజాగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) పార్టీలో చేరారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ సీఎం పళనిస్వామిని కలిసి ఆయన ఆధ్వర్యంలో గౌతమి ఆ పార్టీలో చేరారు.

ఈ విషయాన్ని, అందుకు సంబంధించిన ఫోటోను నెట్టింట పోస్ట్ చేసిన ఏఐఏడీఎంకే... గౌరవనీయులైన జనరల్ సెక్రటరీ పళనస్వామిని నటి గౌతమి కలిశారని.. ఈ సందర్భంగా ఆమె పార్టీలో జాయిన్ అయ్యారని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.



மாண்புமிகு கழகப் பொதுச் செயலாளர் 'புரட்சித் தமிழர்' திரு. @EPSTamilNadu அவர்களை, சென்னை, பசுமைவழிச் சாலையில் உள்ள செவ்வந்தி இல்லத்தில் இன்று (14.2.2024- புதன் கிழமை), பிரபல நடிகை கௌதமி அவர்கள் நேரில் சந்தித்து, தன்னை கழகத்தில் இணைத்துக்கொண்டார். pic.twitter.com/msHo8qkd2r

— AIADMK (@AIADMKOfficial) February 14, 2024
Tags:    
  • Senior 
  • Actress 
  • Gautami 
  • Movies 
  • Politics 
  • Career 
  • Bjp 
  • Resignation 
  • Join 
  • Aiadmk 
  • Politicalnews 
  • Socialmedia 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS