• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైజాగ్ ఫ్లోటింగ్ ...

వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ బ్రేక్... వీడియోతో క్లారిటీ ఇచ్చిన అధికారులు!

| ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యే అంటూ రకరకాల పోస్టులు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. దీంతో... దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-02-27 04:33 GMT

అదిగో తోక అంటే.. ఇదిగో పులు అనే రోజులు ఇవి! దానికి కారణం... సోషల్ మీడియా ఆ స్థాయిలో ప్రాచుర్యంలోకి రావడమే! ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో తెలుసుకునే లోపు... విషయం ఊరంతా చుట్టి వచ్చేస్తుంటుంది. తాజాగా వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జి బ్రేక్ అయిన విషయం కూడా ఆ కోవలోకే వస్తుందంటూ.. వీడియో విడుదల చేశారు అధికారులు. ఇందులో భాగంగా వీడియో ఫుటేజ్ ని, టైం స్టాంప్ ని విడుదల చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం సుమారు 100 మీటర్ల పొడవుతో అలలపై తేలియాడే వంతెనను ఏర్పాటు చేసింది. దీనివల్ల సందర్శకులు సముద్రంలోకి 100 మీటర్ల మేర వెళ్లేలా చేస్తుంది. ఈ వంతెన అలలను తట్టుకుంటూ.. సందర్శకులను సురక్షితంగా ఉంచుతుంది! అయితే... తాజాగా ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే బ్రేక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఒక ఇష్యూ వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేలియాడే వంతెన ప్రారంభించబడిన రోజే కూలిపోయింది.. ఒడ్డు నుంచి జనం చూస్తుండగానే ముక్కలైపోయింది.. అదృష్టవశాత్తు ఈ ఘటన సమయంలో ఆ వంతెనపై ఎవరూ లేరు.. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్యే అంటూ రకరకాల పోస్టులు నెట్టింట హల్ చల్ చేయడం మొదలైంది. దీంతో... దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

దీంతో అధికారులు లైన్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇరిగిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు! ఇందులో భాగంగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పరిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వాలిటీ చెక్ ప్రక్రియలో భాగంగా బ్రిడ్జ్ నుంచి ఫ్లాంట్ ఫాం ను డీ లింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే.. ఇలా బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో రాధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ఈ సమయంలో దానికి సంబంధించి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన డీలింక్ చేస్తున్న దృశ్యాలను.. అప్పటి టైం వివరాలను విడుదల చేశారు. అనంతరం ఈ విషయాలపై స్పందించిన జిల్లా కలెక్టర్, విశాఖ మెట్రోపాలిటన్ కమిషనర్... మాక్ డ్రిల్ లో భాగంగా ఈ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే బ్రిడ్జ్ నుంచి ఫ్లాట్ ఫాం ను విడదీసి పరిశీలించినట్లు చెప్పారు. విషయం తెలుసుకోకుండా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో వాతావరణంలోని మార్పుల వల్లే సోమవారం ఈ బ్రిడ్జ్ పైకి సందర్శకులను అనుమతించలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా... ప్రతీ నెల అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో కాస్త ఎక్కువగా ఉండే ఆటుపోట్ల సమయంలో.. సాంకేతిక పరిశీలనలో భాగంగా చేపట్టే రెగ్యులర్ ప్రొసీజర్ మాత్రమే ఇది అని.. ఇది రెగ్యులర్ గా జరుగుతుందని అన్నారు.

వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విష‌యంలో వాస్త‌వాలు ఇవిగో. ఆ బ్రిడ్జ్ విష‌యంలో ఎల్లోమీడియా చేస్తున్న ప్ర‌చారం అబద్ధం అనేందుకు ఈ సీసీ టీవీ ఫుటేజే సాక్ష్యం.#TDPFakePropagandaExposed#BanYellowMediaSaveAP pic.twitter.com/kJNSUzwUpc

— YSR Congress Party (@YSRCParty) February 26, 2024


విశాఖపట్నంలో నిన్న (25.02.2024) ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని VMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి వాస్తవంగా 26.02.2024 నుండి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ,… https://t.co/F466EijFcE

— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 26, 2024
Tags:    
  • Andhrapradesh 
  • Vizag 
  • Floatingbridge 
  • Break 
  • Socialmedia 
  • Viravideo 
  • Cctvfootage 
  • Government 
  • Clarity 
  • Testing 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS