బాలయ్య చిరు అసెంబ్లీ వివాదం...మీడియా తొక్కేసిందా ?

ఇద్దరూ టాప్ స్టార్స్. టాలీవుడ్ లో సీనియర్ హీరోలు. ఇద్దరి మధ్య సినిమాలలో పోటీ ఎపుడూ ఉంటుంది.;

Update: 2025-09-29 06:14 GMT

ఇద్దరూ టాప్ స్టార్స్. టాలీవుడ్ లో సీనియర్ హీరోలు. ఇద్దరి మధ్య సినిమాలలో పోటీ ఎపుడూ ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం సినిమాలు దాటి రాజకీయాల వైపుగా వివాదం వచ్చింది. దానిని లేవనెత్తింది బాలయ్యే. అఫ్ కోర్స్ ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చిరంజీవి పొలిటికల్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆయన మానాన సినిమాలు చేసుకుంటున్నారు. బాలయ్య విషయానికి వస్తే ఆయన సినిమాలు ప్లస్ రాజకీయాలు కలిపి చేస్తున్నారు. అయితే బాలయ్య సినిమాల విషయంలో ఏమైనా మెగా స్టార్ తో పోటీ పడుతూ కామెంట్స్ చేస్తూ వచ్చేవారు కానీ రాజకీయంగా ఎపుడూ ఆయన మీద అన్నది లేదు. కానీ ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీ వేదికగానే గట్టిగా మాట్లాడారు. ఒక విధంగా ఇది బ్లాస్టింగ్ న్యూస్. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఇది నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలను బయటపెట్టిందా లేక కొత్తగా అగ్గి పుట్టించిందా అన్నది కాసేపు పక్కన పెడితే ఇది పొలిటికల్ గానే కాదు సినీ పరంగానూ హీటెక్కించే న్యూస్ గానే అంతా చూస్తూ వచ్చారు.

పేలాల్సిన న్యూస్ అయినా :

ఒక్కసారిగా పేలాల్సిన న్యూస్ ఇది. అయితే ఈ న్యూస్ లోని సారతను స్ట్రాంగ్ నెస్ ని తీసేసినట్లుగా రెండు రోజులలోనే చప్పగా చల్లబడిపోయింది. దానికి కారణం ఏమిటి అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఏపీలో చూస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఒక సెక్షన్ కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేస్తుంది అన్నది చెప్పుకుంటూ ఉంటారు అలా చెప్పుకోవడం ఏమిటి ఒప్పుకుంటూ ఉంటారు. మరి ఈ వివాదం వల్ల కలిగేది లాభం కాదు అని తెలిసేక కావాలనే తొక్కేశారా అన్నదే ఇపుడు చర్చ. బాలయ్య వర్సెస్ చిరు అన్నది ఎంత లైట్ గా తీసుకుంటే అంత మేలు అన్నట్లుగానే ఈ వివాదాన్ని తగ్గించి చూపే ప్రయత్నం జరిగింది అని అంటున్నారు. అంతే కాదు వీలైనంత వరకూ ఈ డిబేట్ ఏదీ పెద్దగా ఫోకస్ అవకుండానూ జాగ్రత్త పడ్డారు అని అంటున్నారు. ఎందుకంటే ఇది కనుక ఎంతలా సాగదీస్తే అంతలా కూటమిలో కుంపట్లు రాజుకుంటాయన్నది తెలిసిందే. అందుకేనా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ వివాదాన్ని సైడ్ చేసి పారేశారా అన్నది కూడా చర్చగా ఉంది.

రాజకీయ చైతన్యం ఎక్కువ :

నిజానికి చూస్తే ఏపీలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. ప్రతీ చిన్న విషయానికీ చాలా శోధిస్తారు. దానికి అన్నీ తగిలిస్తారు, అలాగే మూలాల్లోకి వెళ్ళి మరీ అన్వేషిస్తారు. కానీ అతి పెద్ద బ్లాస్టింగ్ న్యూస్ గా మారిన బాలయ్య వర్సెస్ చిరు ఇష్యూలో మాత్రం ఆ స్థాయిలో అయితే డిబేట్లు లేవు. దానికి కారణం ఒక ప్రధానమైన సెక్షన్ ఆఫ్ మీడియాను దీనిని ఎత్తుకోకపోవడమే అని అంటున్నారు. దాంతో ఈ విషయం మొదట్లో అగ్గి మంటలు పుట్టిస్తుంది అని అంతా అనుకున్నా ఆ వెంటనే చప్పున చల్లారిపోయినట్లుగా అనిపించింది అని గుర్తు చేస్తున్నారు.

టీ కొట్ల పంచాయతీలలో :

ఇక ఏపీలో రాజకీయ చర్చలు ఎలా ఉంటాయి అంటే టీ కొట్లో పంచాయతీలు జరుగుతాయి. అక్కడికి చేరిన వారు ఆంధ్రా నుంచి అమెరికా రాజకీయం దాకా అంతా చర్చిస్తారు. లోకల్ సర్పంచ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దాకా అన్నీ లోతుగా చర్చించే చోట కూడా ఈ టాపిక్ అంతగా నలగకపోవడానికి కారణం మీడియా తొక్కేయడమే అని అంటున్నారు. మీడియాలో కనుక హైలెట్ అయి ఉంటే ఇది ఆరని మంటగా మారేది. అది పెద్ద ఇష్యూగా ఉండేది. కానీ కావాలనే కన్వీనియెంట్ గానే ఇలా తొక్కేశారా అన్నదే ఇపుడు చర్చ.

ఒక స్టార్ వార్ :

ఒక స్టార్ వార్ ని ఒక పొలిటికల్ వార్ ని లేకుండా కాకుండా చేసేందుకు ఎవరి శక్తి మేరకు ఎవరి వ్యూహాలు ఆలోచనల మేరకు కలివిడిగా విడివిడిగా ఆలోచించి మరీ అంత పెద్ద ఇష్యూని ఏమీ కాకుండా చేశారు అని అంటున్నారు. నిజానికి ఈ ఇష్యూ వెనక ఎన్నో అర్హ్దాలు పరమార్ధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి అది అలా సైడ్ చేయబడింది. కానీ నివురు గప్పిన నిప్పులా అది రాజుకుంటుందా లేక ఇదే తీరున చప్పున వచ్చి గప్ చుప్ అవుతుందా అన్నది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News