అంతరిక్షం నుంచి దూకి బ్రతికాడు.. పారాగ్లైడింగ్ చేస్తూ చనిపోయాడు!

అవును... స్ట్రాటో ఆవరణ నుండి రికార్డు స్థాయిలో దూకిన ఆస్ట్రియన్ బేస్ జంపర్, స్కై డైవర్ అయిన ఫెలిక్స్ బామ్‌ గార్ట్‌ నర్ ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ మరణించారని స్థానిక మీడియా నివేదించింది.;

Update: 2025-07-18 06:14 GMT

సప్త సముద్రాలు ఈదిన వ్యక్తికి పిల్ల కాలువలో సమస్య వచ్చినట్లు.. దశాబ్దం క్రితం స్ట్రాటో ఆవరణలో 24 మైళ్ల ఎత్తు నుంచి దూకి, ధ్వని వేగం కంటే వేగంగా భూమికి చేరిన మొదటి స్కై డైవర్, 56 ఏళ్ల ఎక్స్‌ ట్రీమ్ అథ్లెట్ ఫెలిక్స్ బామ్‌ గార్ట్‌ నర్.. ఇటలీ తూర్పు తీరంలో గురువారం జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా నివేదించింది.

అవును... స్ట్రాటో ఆవరణ నుండి రికార్డు స్థాయిలో దూకిన ఆస్ట్రియన్ బేస్ జంపర్, స్కై డైవర్ అయిన ఫెలిక్స్ బామ్‌ గార్ట్‌ నర్ ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ మరణించారని స్థానిక మీడియా నివేదించింది. తన పారాగ్లైడర్‌ పై నియంత్రణ కోల్పోయి తీరప్రాంత పట్టణం పోర్టో సాంట్ ఎల్పిడియోలోని ఒక హోటల్ స్విమ్మింగ్ పూల్‌ ను ఆయన ఢీకొట్టినట్లు చెబుతున్నారు.

ఆ సమయంలో ఆయన ఓ మహిళను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. అయితే.. ఆమెకు పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. మరోవైపు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోర్టోశాంట్ ఎల్పిడియో మేయర్.. బామ్‌ గార్ట్ నర్ మరణంతో తమ సమాజం తీవ్రంగా ప్రభావితమైందని అన్నారు.

మలేషియాలోని 'పెట్రోనాస్ టవర్స్', రియో డి జనీరోలోని 'క్రైస్ట్ ది రిడీమర్' విగ్రహం వంటి ల్యాండ్‌ మార్క్‌ ల నుండి బేస్ జంప్ చేసిన బామ్‌ గార్ట్‌ నర్.. 2012లో భూమి నుండి 24 మైళ్ల ఎత్తు నుండి స్కైడైవింగ్ చేయడం ద్వారా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టినప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. దీన్ని రెడ్ బుల్ స్పాన్సర్ చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన రెడ్ బుల్.. గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా... తమ చిరకాల స్నేహితుడు ఫెలిక్స్ బామ్‌ గార్ట్‌ నర్ వినాశకరమైన వార్త విని షాక్ అయ్యామని, విచారంలో మునిగిపోయామని తెలిపింది. అతడు ఎగరడానికే పుట్టాడని.. పరిమితులను అధిగమించడానికి దృఢంగా నిశ్చయించుకున్నాడని వెల్లడించింది.

కాగా... 2012లో బామ్‌ గార్ట్ నర్ భూమికి ఎత్తులో ఉన్న క్యాప్సూల్ నుండి బయటకు వచ్చినప్పుడు కూల్‌ గా థంబ్స్ అప్‌ ను చూపించి.. నేలకు దగ్గరగా వచ్చినప్పుడు తన పారాచూట్‌ ను యాక్టివేట్ చేసి.. ల్యాండ్ అయిన తర్వాత విజయంతో తన చేతులను పైకి లేపాడు. ఆ క్షణాన్ని కొన్ని లక్షల మంది యూట్యూబ్ లైవ్ లో వీక్షించారు.

Full View
Tags:    

Similar News