కోడలిని రే*ప్ చేసి, ఇంటి ముందే పాతిపెట్టి... షాకింగ్ ఘటన!
ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా మానవత్వం, బంధాలు - అనుబంధాలు అనేవి రోజురోజుకీ కాలగర్భంలో కలిసిపోతున్నట్లున్నాయి.;
ఈ సమాజంలో రోజు రోజుకీ షాకింగ్ ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో అన్నట్లుగా మానవత్వం, బంధాలు - అనుబంధాలు అనేవి రోజురోజుకీ కాలగర్భంలో కలిసిపోతున్నట్లున్నాయి. ఈ క్రమంలో తన కోడలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, అనంతరం హత్యచేసి, ఇంటిముందే పాతిపెట్టి, ఏమీ తెలియనట్లు ఫిర్యాదు చేసిన వ్యవహారం తెరపైకి వచ్చింది.
అవును... హర్యానాలోని ఫరీదాబాద్ లో ఇంటి ముందు తవ్విన గోతిలో, ఆ ఇంటి కోడలిని పాతిపెట్టీ, అంతకంటే ముందు ఆమెపై మామ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె అదృశ్యమైనట్లు పోలీసులకు అత్తా, మామ ఫిర్యాదు చేసిన సుమారు రెండు నెలల తర్వాత ఈ కేసులో చిక్కుముడి వీడింది. అత్యంత ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్ కు చెందిన బాధితురాల(24)కి.. 2023 జూలైలో ఫరీదాబాద్ కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే.. వివాహం జరిగిన రెండు సంవత్సరాల లోపే ఆమె కట్నం కోసం వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమెను అంతమొందించాలని మామ ఫిక్సయ్యారు. వెంటనే ఓ ప్లాన్ రచించి, దాన్ని అమలుచేశారు.
ఇందులో భాగంగా... తన భార్యను ఉత్తరప్రదేశ్ లోని ఎటాలో జరిగిన వివాహానికి పంపించారు మామ. ఈ క్రమంలో... ఏప్రిల్ 21 రాత్రి కోడలు, ఆమె సోదరి తిన్న ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. దీంతో... ఆ ఇద్దరు మహిళలు వేర్వేరు అంతస్తుల్లో, వేరువేరు గదుల్లో స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో మామ కోడలి గదిలోకి వెళ్లాడు!
అనంతరం.. అపస్మారక స్థితిలో ఉన్న కోడలిపై అత్యాచారం చేశాడని అంటున్నారు. అయితే ఈ విషయం అతని భార్య, కుమారుడికి తెలియదు. అనంతరం ఆమెను హత్య చేశాదు. ఆ తర్వాత తన కొడుకును మేడమీదకు పిలిచాడు. వారిదదరూ వారు కలిసి ఆ మహిళ మృతదేహాన్ని చుట్టి, ఇంటి వెలుపల ఉన్న వీధిలో అప్పటికే తవ్విన గుంతలో పూడ్చి పెట్టారు.
పొరుగువారికి మాత్రం మురుగునీటి పారుదల కోసం ఆ గుంట తవ్వినట్లు చెప్పి నమ్మించారు. మృతదేహాన్ని లోపల ఉంచిన తర్వాత ఇటుకలు, మట్టితో నింపేశారు. కొన్ని రోజుల తర్వాత దానిపై కాంక్రీట్ స్లాబ్ వేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న తన కోడలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు! అయితే పోలీసుల దర్యాప్తులో.. వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.
దీంతో.. పాక్షికంగా కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టు మార్టంకు పంపించారు. మామ, అత్త, భర్త సహా కుటుంబంలోని నలుగురిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. విచారణలో.. మామ పైన పేర్కొన్న విషయాలన్నీ అంగీకరించినట్లు చెబుతున్నారు!