న‌కిలీ మ‌ద్యం: 2 వీడియోలు.. 4 రాజ‌కీయాలు.. !

రాష్ట్రాన్ని కురిపిస్తున్న నకిలీ మద్యం కుంభకోణం విషయంలో రెండు వీడియోలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.;

Update: 2025-10-17 04:19 GMT

రాష్ట్రాన్ని కురిపిస్తున్న నకిలీ మద్యం కుంభకోణం విషయంలో రెండు వీడియోలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అద్దేప‌ల్లి జనార్దన్ రావు ఈ రెండు సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియాలోకి విడుదల చేశారు. అయితే ఒకటి ఆయ‌న‌ ఆఫ్రికా నుంచి ఏపీకి రావడానికి ముందే విడుదల చేయగా రెండోది ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత విడుదల చేసిన వీడియో. ఈ రెండు వీడియోలు కూడా విభిన్నంగా ఉన్నాయి.

ఒకదానికి ఒకదానికి పొంత‌న‌ లేకుండా కూడా ఉన్నాయి. అయితే, రెండో వీడియోను అడ్డుపెట్టుకొని టిడిపి నాయకులు. మొదటిసారి చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని వైసిపి నాయకులు పలు రకాల రాజకీయాలు చేస్తున్నారన్నది వాస్తవం. మొదటిసారి చేసిన వీడియోలో ఏ రాజకీయ నాయకుడితోనూ ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధం లేదని తనే చేశానని అద్దేపల్లి ఒప్పుకున్నారు. అంతేకాదు తను అన్ని నిజాలే చెబుతానని ఏపీకి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి తీసుకువస్తానని కూడా వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీ నాయకుడితోనో అంట కాగలేదని అన్నారు.

కానీ రెండో వీడియో వచ్చేసరికి పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం వెనక వైసిపి నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారని ఆయన ప్రోద్బ‌లంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని చెప్పకు వచ్చారు. మరి దీనిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పక్కన పెడితే.. ఈ రెండు విషయాలు కూడా రాజకీయంగా ఇరు పార్టీల మధ్య తీవ్ర వివాదానికి విమర్శలకు దారి తీశాయి. మీ హస్తం ఉందంటే మీ హస్తం ఉందని వైసీపీ టిడిపి నాయకులు విమర్శించుకుంటున్నారు. యాగీ చేసుకుంటున్నారు.

మరోవైపు జోగి రమేష్ తన పాత్ర లేదని అవసరమైతే లైవ్ డిటెక్టర్ టెస్ట్ కు తాను హాజరవుతానని చెబుతున్నారు. మొత్తంగా అసలు ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఈ పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుంది ఎలాంటి పరిణామాలు తెర‌ మీదకు వస్తాయన్నది ఒక ఆలోచన అయితే ఈ రెండు వీడియోలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసుకుంటున్న రెండు పార్టీలు వ్యవహారం మరో చర్చగా మారింది. ఏది ఏమైనా అసలు ఏం జరిగిందని ప్రజలకు తెలియాలంటే ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News