తిప్పలు మీవే: ప్రధాని మోడీ హెచ్చరికలు.. విన్నారా?!
ప్రజలకు ఆపద వస్తే.. హెచ్చరించడం కామనే. ఏ తుఫానులో.. విపత్తులో.. భూకంపాలో వంటివి చెప్పకుండా.. వస్తాయి కాబట్టి.. అప్రమత్తం కావాలని హెచ్చరించడం తెలిసిందే.;
ప్రజలకు ఆపద వస్తే.. హెచ్చరించడం కామనే. ఏ తుఫానులో.. విపత్తులో.. భూకంపాలో వంటివి చెప్పకుండా.. వస్తాయి కాబట్టి.. అప్రమత్తం కావాలని హెచ్చరించడం తెలిసిందే. వీటిని పాటించడం ద్వారా.. కొంతలో కొంత వరకు ప్రజలు రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కానీ.. తెలిసి చేసే వ్యవస్థీకృత నేరాలు.. ముఠాలు సాగించే నేరాలను అదుపు చేయాల్సిందిపోయి.. ప్రజలను హెచ్చరించడం.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. తాజాగా రెండు కీలక విషయాల్లో కేంద్రంలోని మోడీ సర్కారు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
వాస్తవానికి ఈ రెండు విషయాల్లో కేంద్రంబలంగా పనిచేస్తే.. మోసాలను అరికట్టడంతోపాటు.. ప్రజలకు కూడా తిప్పలు తప్పింవచ్చు. కానీ, మోడీ సర్కారు మాత్రం ``అప్రమత్తంగా ఉండండి.. లేక పోతే.. తిప్పలు పడతారు!`` అని హెచ్చరించింది. వీటిలో
1) విశృంఖలంగా పెరిగిపోయిన 500 నకిలీ నోట్ల వ్యవహారం.
2) ఆన్‌లైన్ మోసాలు. ఈ రెండు విషయాలపై తాజాగా రాష్ట్రాలకు, ప్రజలకు కూడా.. మోడీ సర్కారు బహిరంగ వినతులు.. విజ్ఞప్తులు చేసింది. కానీ.. వీటిని కట్టడి చేసే అవకాశం కేంద్రానికి ఉందని విపక్షాలు చెబుతున్నాయి.
తాజాగా చేసిన ప్రకటన ప్రకారం.. దేశంలో రూ.500 నకిలీ నోట్లు పెరిగిపోయాయి. వీటిని గుర్తించడం చాలా చాలా కష్టమని కేంద్రం చెప్పింది. RESERVE BANK అని ముద్రించిన చోట నకిలీ నోట్లలో RASERVE BANK అని ఉంటుందని.. దీనిని బట్టి నకిలీ నోట్లను గుర్తించి జాగ్రత్త పడాలని కేంద్రం ప్రజలకు సూచించింది. అయితే.. గుర్తించిన వాటిని ఏం చేయాలన్న దానికి క్లారిటీ ఇవ్వలేదు. వీటిని బ్యాంకులు తీసుకోవు.. ఆర్థిక సంస్థలు తీసుకోవు. సో.. ఏం చేయాలోమాత్రం చెప్పలేదు.
ఇక, ఈ నెల చివరి వారంలో చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి.. టికెట్లు బుక్ చేసే పేరుతోను.. రూమ్‌లు, గుర్రాలు బుక్ చేసేపేరుతోనూ.. నకిలీ వెబ్ సైట్లు, వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పేజీలు పెరిగిపోయాయని కేంద్రం చెప్పింది. అయితే.. ఈ విషయంలో భక్తులే అప్రమత్తంగా ఉండాలని.. డబ్బులు పోతే తిరిగి రాబోవని కూడా చెప్పడం గమనార్హం. కానీ.. ఇలాంటి నకిలీల విషయంలో ఏఐని వినియోగించే వ్యవస్థ దేశంలో అందుబాటులోకి వచ్చింది.దానిని వాడుకుని అడ్డుకట్ట వేయొచ్చు. కానీ.. ప్రజలకు హెచ్చరికలు చేసి కేంద్రం చేతులు దులుపుకొందని అంటున్నాయి ప్రతిపక్షాలు.