ఆ ఓటమితో కసి పెరిగింది.. ఈటల సంచలన వ్యాఖ్యలు

అయితే, ఈ సారి అనూహ్యంగా రెండు చోట్ల ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యాడ. బైపోల్ లో 21వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈటల రాజేందర్.

Update: 2023-12-14 12:49 GMT

తెలంగాణలో పాలిటిక్స్ లో గుర్తింపు ఉన్న నేతల్లో ఈటల రాజేందర్ ది ఎప్పుడూ ముందువరుసే. టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో ఆయనకు అప్పటి సీఎం కేసీఆర్ తర్వాత అంత క్రేజ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక దశలో ఈటల రాజేందర్ సీఎం ఎందుకు కావద్దు? అన్న క్వశ్చన్ మార్క్ రావడంతో ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ మంత్రి పదవితో పాటు పార్టీ నుంచి బీఆర్ఎస్ పంపించివేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఆయన ప్రజా క్షేత్రంలో కేసీఆర్ ను ఢీ కొన్నాడు. 2021 హుజూరాబాద్ బైపోల్ ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగానే కొనసాగింది. ఈ ఎన్నికల సందర్భంగానే కేసీఆర్ 'దళిత బంధు' తెచ్చారు.

బీఆర్ఎస్ రాజీనామా అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లారు. అక్కడ కూడా అగ్రనాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. అధిష్టానంకు కూడా దగ్గరయ్యారు. ఈ సారి కేసీఆర్ పై నిలబడతానని ఆయన ఓటమి తనతోనే సాధ్యమని ప్రసంగాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ మేరకు బీజేపీ అధిష్టానం సైతం గజ్వేల్ లో కేసీఆర్ కు పోటీగా నిలబెట్టింది. ముదిరాజులు ఎక్కువగా ఉండడంతో తన గెలుపు నల్లేరుపై నడకే అన్నట్లుగా వ్యవహరించాడు ఈటల రాజేందర్. గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లోనూ ఆయన పోటీ చేశారు. అయితే, ఈ సారి అనూహ్యంగా రెండు చోట్ల ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యాడ. బైపోల్ లో 21వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈటల రాజేందర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 17వేల పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యాడు.

Read more!

రెండు చోట్ల ఓడిపోవడంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారింది ఈటల రాజేందర్ భవిష్యత్. అయితే ఇటీవల ఆయన గజ్వేల్ ఓటమిపై స్పందించారు. గజ్వేల్ లో 'డబ్బు మద్యం మాత్రమే కేసీఆర్ గెలుపునకు తోడ్పడ్డాయి' అని ఆరోపణలు చేశారు. 'కేసీఆర్ ప్రజలు నమ్ముకున్న నాయకుడు కాదు. స్థానిక నేతలను భారీ మొత్తానికి కొని గెలిచారు. విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు. గజ్వేల్ ఓటమితో నాలో విపరీతమైన కసి పెరిగింది.' అని ఈటల రాజేందర్ అన్నారు.

Tags:    

Similar News