• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.2వేల నోట్ల మార్పిడికి...

రూ.2వేల నోట్ల మార్పిడికి ఇవాళే ఆఖరి రోజు.. తర్వాతేం కానుంది?

| పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెర మీదకు వచ్చిన రూ.2వేల నోట్ల చలామణిపై రిజర్వు బ్యాంక్ విధించిన గడువు ఈ రోజు (శనివారం)తో తీరనుంది.

By - Tupaki Desk
Update: 2023-09-30 05:16 GMT

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెర మీదకు వచ్చిన రూ.2వేల నోట్ల చలామణిపై రిజర్వు బ్యాంక్ విధించిన గడువు ఈ రోజు (శనివారం)తో తీరనుంది. ఇప్పటికే రూ.2వేల నోట్ల చలామణిపై ఆర్ బీఐ స్పష్టమైన విధానాల్ని ప్రకటించటంతో పాటు.. ప్రజల వద్ద ఉన్న రూ.2వేల నోట్లను తిరిగి బ్యాంకులకు ఇచ్చేందుకు సెప్టెంబరు 30 వరకు గడువును విధించటం తెలిసిందే. ఈ రోజుతో ఆ గడువు తీరనుంది. అయితే.. చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లకు సంబంధించి ఇప్పుడెలాంటి నిర్ణయాన్ని తీసుకోనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆర్ బీఐ వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం.. రూ.2వేలనోట్ల మార్పిడికి సంబంధించిన గడువును అక్టోబరు 31 వరకు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రవాస భారతీయుల ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకొని ఈ గడువు పెంచే వీలుందని చెబుతున్నారు. రూ.2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లుగా ఆర్ బీఐ ఈ ఏడాది మే 19న ప్రకటన చేయటం.. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లోనూ.. వాణిజ్య సంస్థల్లోనూ డిపాజిట్ చేయాలని కోరారు. ఇందుకు సెప్టెంబరు 30ను ఆఖరు తేదీగా ప్రకటించారు.

సెప్టెంబరు ఒకటిన ఆర్ బీఐ చేసిన ప్రకటనను చూస్తే.. ఇప్పటివరకు రెండు వేల రూపాయిల నోటుకు సంబంధించి 93 శాతం నోట్లు ఆర్ బీఐకు చేరుకున్నట్లుగా ప్రకటించారు. వీటి విలువ రూ.3.32 లక్షల కోట్లు.. మరో రూ.24వేల కోట్లకు సంబంధించిన నోట్లు తిరిగి రావాల్సి ఉందని తేలింది. మరి.. ఈ నోట్లు వెనక్కి రావటం కోసం గడువు పెంచుతారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగామారింది.

బ్యాంకింగ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రూ.2వేల నోట్ల రాక పూర్తిగా ఆగిపోయినట్లుగా చెబుతున్నారు. అనివార్య కారణాలతో గడువు లోపు నోట్లను మార్చుకోలేకపోతే.. ఆ నోట్లు ఏమవుతాయి? పనికిరావా? లాంటి వాటిపై ఆర్ బీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ రోజుతో గడువు ముగిసిపోతున్న నేపథ్యంలో రూ.2వేల నోట్లకు సంబందించిన ప్రకటన రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • 2000notes 
  • RBI 
  • Latestnews 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS