జాబ్ లో చేరిన 3 గంటల్లోనే రిజైన్
ఉద్యోగులు తమ అనుభవాల్ని పంచుకునే వేదిక రెడ్డిట్. కొందరు తమ సమస్యల్ని.. మరికొందరు తమ అనుభవాల్ని ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు.;
ఉద్యోగులు తమ అనుభవాల్ని పంచుకునే వేదిక రెడ్డిట్. కొందరు తమ సమస్యల్ని.. మరికొందరు తమ అనుభవాల్ని ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఒకరు పోస్టు చేసిన అంశం వైరల్ గా మారింది. తాను జాబ్ లో చేరిన మూడు గంటల్లోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పేర్కొన్నారు. తనకు వర్కు ఫ్రం హోంజాబ్ వచ్చిందని.. నెలకు రూ.12 వేలు శాలరీ చెప్పారని పేర్కొన్నారు.
అయితే.. జాబ్ లో చేరిన మూడు గంటల్లోనే రిజైన్ చేసినట్లుగా సదరు వ్యక్తి పేర్కొన్నారు. దీనికి కారణం తొమ్మిది గంటల షిఫ్ట్ కావటమేనని పేర్కొన్నారు. మొదట్లో ఈ జాబ్ చేయాలని అనుకున్నా.. ఆ ఉద్యోగం తన సమయం మొత్తాన్ని హరిస్తుందన్న ఉద్దేశంతోనే తన జాబ్ కు రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. తాను చేరిన ఉద్యోగంతో తాను జీవితంలో ఎదగలేనని అర్థమైందని.. అందుకే విలువైన సమయాన్ని వృథా చేసుకోవటం ఇష్టం లేకనే జాబ్ కు గుడ్ బై చెప్పేసినట్లుగా వెల్లడించారు.
తాను పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పిన సదరు వ్యక్తి.. ఏదైనా పార్ట్ టైం జాబ్ ఉంటుందని వెతికానని.. మొదట్లో ఇలాంటి ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు పార్ట్ టైమ్ గిగ్ లా ఉంటుందని భావించినా.. అది ఫుల్ టైం అన్న విషయం అర్థమైందని.. చేరిన మూడు గంటలకు రిజైన్ చేసినట్లుగా పేర్కొన్నారు. వైరల్ అయిన ఈ పోస్టుకు నెటిజన్లు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కొందరు మంచి నిర్ణయమని పేర్కొంటే.. మరికొందరు మాత్రం ఇలాంటివన్నీ ముందే చూసుకొని అప్లై చేసి ఉంటే బాగుండేదన్న సూచన చేయటం గమనార్మం.